భారీ షెడ్యూల్ కోసం ప్లైట్ ఎక్కుతోన్న స్టార్లు!
స్టార్ హీరోల చిత్రాల షూటింగ్ అంటే విదేశీల్లో తప్పనిసరి. స్టోరీ డిమాండ్ మేరకు ఖండాలు తప్పక దాటాల్సిందే.
By: Srikanth Kontham | 17 Sept 2025 2:00 AM ISTస్టార్ హీరోల చిత్రాల షూటింగ్ అంటే విదేశీల్లో తప్పనిసరి. స్టోరీ డిమాండ్ మేరకు ఖండాలు తప్పక దాటాల్సిందే. అందులోనూ పాన్ ఇండియా సినిమాలంటే ఎంత మాత్రం రాజీపడటానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ రాజీ పడి సెట్స్ వేసినా? వాస్తవ లొకేషన్లలో చూసిన ఫీల్ రాదు. ఖర్చు కూడా ఎక్కడా తగ్గదు. సెట్ల కోసం కోట్లు ఖర్చుచేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే వీలైనంత వరకూ ఫారిన్ షెడ్యూల్స్ తప్పక ఉంటాయి. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అలు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండి యాలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
50 రోజులు మండే ఎండల్లోనే:
ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి స్వదేశంలోనే చిత్రీకరణ జరుగుతోంది. ముంబై వేదికగానే షూటింగ్ జరుగుతోంది. ముంబైలోనే కొన్ని సెట్లు వేసి చిత్రీకరిస్తున్నారు. అవసరం మేర స్థానికంగా వివిధ లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నారు. త్వరలోనే ముంబై షూట్ ముగియనుందని తెలుస్తోంది. తదుపరి కొత్త షెడ్యూల్ అబుదాబిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది భారీ షెడ్యూల్. దాదాపు 50 రోజుల పాటు షూటింగ్ అక్కడే ఉంటుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో దీపికా పదుకొణే కూడా పాల్గొంటుంది.
10 దేశాల్లో డ్రాగన్ :
బన్నీ-దీపిక మధ్య కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. బన్నీపై కొన్ని పోరాట సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారుట. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శక త్వంలో `డ్రాగన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి ఇండి యాలోనే షూట్ జరుగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ అనంతరం ఫారిన్ షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. `డ్రాగన్` చిత్రీకరణ మొత్తం 10 దేశాల్లో ప్లాన్ చేసారు.
క్లారిటీ వచ్చేది అప్పుడే:
వాటిలో వివిధ ఎగ్జోటిక్ లోకేషన్లలోనే చిత్రీకరణ జరుగుతోంది. స్టోరీ డిమాండ్ మేరకు ప్రశాంత్ నీల్ ఎక్కడా రాజీ పడటం లేదు. సాధారణంగా నీల్ సినిమాలంటే విదేశీ షూటింగ్ ల కంటే సెట్స్ వేసి పూర్తిచేయడం అలవాటు. కానీ `డ్రాగన్` స్టోరీ విదేశీ లొకేషన్లను డిమాండ్ చేయడంతో? దేశాలు దాటుతున్నారు. విదేశీ షెడ్యూల్స్ లో భాగంగా నీల్ అక్కడ టీమ్ తో పని చేయనున్నారుట. ఎక్కువ రోజులు షూటింగ్ డేస్ ఉండటంతో స్థానికంగానే అవసరమైన స్టాప్ ని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారుట. మరి ఈ ప్రచారంలో నిజమెంతో ఆయ నిర్మాణ సంస్థలు ఓపెన్ అయితే గానీ క్లారిటీ రాదు.
