Begin typing your search above and press return to search.

'రాకా' కంటే ముందు AA23... సాధ్యమేనా?

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘రాకా’ విడుదలకు సమయం పట్టే అవకాశం ఉండటంతో, అంతకంటే ముందే లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బన్నీ కోసం లోకేష్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని సమాచారం.

By:  Ramesh Palla   |   28 Nov 2026 11:00 PM IST
రాకా కంటే ముందు AA23... సాధ్యమేనా?
X

అల్లు అర్జున్‌ 'పుష్ప' ప్రాంచైజీ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. అందుకే ఆయన ఏ సినిమా చేసినా, చేయబోతున్నా ఆ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరగడం కామన్‌గా మారింది. అల్లు అర్జున్‌కి సంబంధించిన చిన్న విషయం కూడా ఇప్పుడు జాతీయ మీడియాలో పెద్ద వార్తగా నిలుస్తూ ఉంది. పుష్ప 2 విడుదల తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ చివరకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో 'రాకా' సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. రాకా సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో, భారీ వీఎఫ్‌ఎక్స్‌తో అట్లీ రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పటికే మేకింగ్‌ ప్రారంభం అయ్యి ఏడాది దాటినా ఇప్పటి వరకు షూటింగ్‌ ఎంత వరకు పూర్తి అయిందనే విషయమై స్పష్టత లేదు. వచ్చే ఏడాదిలో అయినా రాకా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాకా సినిమాతో అల్లు అర్జున్‌...

ఈ సమయంలో రాకా సినిమా కంటే ముందు అల్లు అర్జున్‌ ఒక సినిమాతో వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కొత్త ప్రచారం మొదలైంది. అల్లు అర్జున్‌ రాకా మాత్రమే ప్రస్తుతం చేస్తున్నాడు. మరి రాకా కంటే ముందు మరో సినిమా ఎలా వస్తుందనే అనుమానం రావచ్చు. కానీ సినీ వర్గాలు, మీడియా సర్కిల్స్‌ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌ అతి త్వరలోనే లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. వరుసగా బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్‌ సినిమాలు చాలా సింపుల్‌గా, చాలా తక్కవ బడ్జెట్‌లో, చాలా తక్కువ సమయంలో పూర్తి చేయడం మనం చూస్తూ ఉంటాం. అందుకే అల్లు అర్జున్‌తో ఆయన వచ్చే ఏడాది సినిమాను ప్రారంభించి, కేవలం నాలుగు అయిదు నెలల్లో లేదా ఆరు నెలల్లో పూర్తి చేసి విడుదల చేసినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో బన్నీ...

రాకా సినిమాకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్‌కే ఇంకా చాలా సమయం పడుతుందని, వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ మొదలు పెడితే అది ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేమని యూనిట్‌ సభ్యులు కొందరు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. కనుక రాకా సినిమా 2027 లో రావడం అనేది దాదాపు అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫ్యాన్స్‌ గురించి ఆలోచించే అల్లు అర్జున్‌ మరీ ఎక్కు గ్యాప్‌ రావద్దని, ఫ్యాన్స్‌ను నిరుత్సాహంకు గురి చేయవద్దనే ఉద్దేశంతో లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను జెట్‌ స్పీడ్‌గా పూర్తి చేసే విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్‌ ఇప్పటికే బన్నీ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేశాడు. లోకేష్ సూపర్‌ హిట్‌ సినిమాలకు రచయితగా వ్యవహరించిన రత్న కుమార్‌ ఇప్పుడు బన్నీ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో అల్లు అర్జున్‌ మూవీ...

అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా తర్వాత తీసుకున్న గ్యాప్‌ కారణంగా ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్‌ హీరో సినిమాకు సినిమాకు మరీ ఇంత ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటే ఎలా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అందుకే రాకా సినిమా రావడానికి కొన్ని నెలల ముందే లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసి విడుదల చేయడం ద్వారా ఈ గ్యాప్‌ ను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పూర్తి చేసినట్లు అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌, లోకేష్ కనగరాజ్‌ కాంబోలో మూవీ గతంలోనే రావాల్సి ఉంది. అప్పుడు సాధ్యం కాలేదు, ఇప్పుడు లోకేష్ కొత్త ప్రాజెక్ట్‌ మొదలు పెట్టని కారణంగా ఇప్పుడు వెంటనే ఆయనకు బన్నీ డేట్లు ఇచ్చాడని టాక్‌ వినిపస్తుంది. అల్లు అర్జున్‌, లోకేష్ కనగరాజ్ కాంబో మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాదిలో వీరి కాంబో మూవీ వస్తే కచ్చితంగా ఫ్యాన్స్‌ కి పండగే అనడంలో సందేహం లేదు.