బన్నీ-అట్లీ సినిమా.. ఈ ఊరింపులేమిటో?
వీళ్లిద్దరి కలయికలో సన్ పిక్చర్స్ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమా కావడం.. హాలీవుడ్ వీఎఫెక్స్ స్టూడియోలో ఇందులో ఇన్వాల్వ్ కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు.
By: Garuda Media | 7 April 2026 11:03 AM ISTప్రస్తుతం ఇండియన్ సినిమాలో మేకింగ్ దశలో ఉన్న చిత్రాల్లో అత్యధిక అంచనాలున్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఒకటి. పుష్ప, పుష్ప-2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాక బన్నీ నటిస్తున్న సినిమా ఇది. మరోవైపు దర్శకుడిగా ఇప్పటిదాకా అపజయం ఎరుగని అట్లీ.. చివరగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తీశాడు.
వీళ్లిద్దరి కలయికలో సన్ పిక్చర్స్ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమా కావడం.. హాలీవుడ్ వీఎఫెక్స్ స్టూడియోలో ఇందులో ఇన్వాల్వ్ కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. ఇంకో రెండు రోజుల్లో అల్లు అర్జున్ పుట్టిన రోజు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల ముందే బన్నీ సన్నిహితులు, పీఆర్ టీం సభ్యులు హంగామా మొదలుపెట్టేశారు.
కొన్ని సింబల్స్, ఎమోజీలతో బన్నీ వాసు సహా బన్నీ సన్నిహితులు, పీఆర్వోలు ఎక్స్‌లో పోస్టులుపెడుతున్నారు. అందరి పోస్టుల్లో కామన్‌గా కనివిపిస్తున్న సింబల్స్ మూడు ఉన్నాయి. ఒకటి వుడ్ అయితే.. ఇంకోటి పెట్రోల్ పంప్.. మరొకటి ఫైర్ ఎమోజీ. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ గురించి ఈ సింబల్స్ ద్వారా సంకేతాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి సినిమా టైటిల్ వైల్డ్ ఫైర్ ఏమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇంకా రకరకాల ఊహాగానాలు కూడా చేస్తున్నారు. కొందరేమో.. సోషల్ మీడియాను తగలబెట్టేయడానికి అప్‌డేట్ రెడీ అయిందని ఇలా సంకేతాలు ఇస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. బన్నీ టీం ఉద్దేశం ఏమో కానీ.. టైటిల్, ఫస్ట్ లుక్ బయటికి రావడానికి ముందే సోషల్ మీడియా అయితే దీని గురించి చర్చించుకోవడం మొదలు పెట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఫస్ట్ లుక్ బయటికి వస్తుందని.. అంతకంటే ముందు ఫస్ట్ లుక్ టైమింగ్ గురించి వెల్లడిస్తూ.. ప్రి లుక్ కూడా ఒకటి వదిలే అవకాశముందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో బన్నీ భిన్న అవతారాల్లో కనిపించనున్నాడు. అందులోని ఒక అవతారంతో స్టన్నింగ్‌గా ఫస్ట్ లుక్ ఉంటుందని అంటున్నారు.
