ముంబైలో అల్లు.. ఇల్లు మాత్రమేనా లేక బిగ్ ప్లానా?
ముంబై అనేది గ్లోబల్ మార్కెట్ కు ఒక పర్ఫెక్ట్ రోడ్ లాంటిది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే అక్కడి ఏజెన్సీలతో కనెక్ట్ అయి ఉండటం చాలా ముఖ్యం.
By: M Prashanth | 22 April 2026 12:36 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు కేవలం సౌత్ సినిమాలకే పరిమితం కాకుండా నేరుగా బాలీవుడ్ హార్ట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప సినిమాతో హిందీ బెల్ట్ లో సంపాదించుకున్న క్రేజ్ ను మరింత పటిష్టం చేసుకోవడానికి ఆయన ముంబైని తన సెకండ్ హోమ్ గా మార్చుకుంటున్నారు. గతంలో చాలా మంది హీరోలు హిందీ సినిమాల కోసం ముంబై వెళ్లి వచ్చేవారు, కానీ అల్లు అర్జున్ మాత్రం అక్కడ పక్కాగా బేస్ మెంట్ వేసుకుంటుండటం విశేషం.
అసలు విషయం ఏంటంటే, ముంబైలోని జుహు తారా రోడ్ లో అల్లు అర్జున్ ఒక లగ్జరీ ఫైవ్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ ను అద్దెకు తీసుకున్నారు. సముద్రానికి ఎదురుగా ఉండే ఈ ప్రాపర్టీ కోసం నెలకు సుమారు 16 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం ఉండటానికి తీసుకున్న ఇల్లు మాత్రమే కాదు, దీని వెనుక ఒక బలమైన బిజినెస్ వ్యూహం కూడా ఉంది. ముంబైలో ఉంటే బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్‌లతో నిరంతరం టచ్ లో ఉండటం ఈజీ అవుతుంది. కొత్త ప్రాజెక్టుల చర్చలు, డీల్స్ సెట్ చేసుకోవడానికి ఇదొక వ్యూహాత్మక అడుగు అని చెప్పవచ్చు.
ముంబై అనేది గ్లోబల్ మార్కెట్ కు ఒక పర్ఫెక్ట్ రోడ్ లాంటిది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే అక్కడి ఏజెన్సీలతో కనెక్ట్ అయి ఉండటం చాలా ముఖ్యం. అల్లు అర్జున్ తన బ్రాండ్ వాల్యూను కేవలం ఇండియాకే కాకుండా గ్లోబల్ లెవల్ కు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారు. అందుకే ముంబైలో ఒక పర్మనెంట్ ఆఫీస్ లాంటి సెటప్ ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి వారితో చేయబోయే సినిమాలకు సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా ఇక్కడి నుండే సాగే అవకాశం ఉంది.
కేవలం పని మాత్రమే కాకుండా ఫ్యామిలీకి కూడా అల్లు అర్జున్ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. తన భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ వెకేషన్స్ లో తనతో గడిపేందుకు ఈ ఇల్లు ఒక పర్‌ఫెక్ట్ స్పాట్ లా ఉంటుంది. ముంబైలో పిల్లలకు కూడా కొత్త వాతావరణం దొరుకుతుందని ఆయన భావిస్తున్నారు. షూటింగ్స్ వల్ల బిజీగా ఉన్నా, హాలిడేస్ లో ఫ్యామిలీ అందరూ ఒకే చోట ఉండేలా ఈ లగ్జరీ హోమ్ ను డిజైన్ చేయించుకున్నారట. సుమారు 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా పర్సనల్ గా కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ ముంబై షిఫ్టింగ్ అనేది టాలీవుడ్ లో ఒక కొత్త చర్చకు దారి తీస్తోంది. సౌత్ స్టార్స్ ముంబైలో పాగా వేయడం వల్ల వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో త్వరలోనే తెలియనుంది. అద్దె కోసమే కోట్లలో ఖర్చు చేస్తున్నారంటే, ఆయన టార్గెట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే ఇల్లు కూడా కొనే అవకాశం ఉండవచ్చు. కేవలం నటుడిగానే కాకుండా ఒక బిజినెస్ మెన్ గా కూడా తన మార్కెట్ ను విస్తరించుకోవడంలో బన్నీ సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. మరి ఈ ముంబై అడ్డా నుండి అల్లు అర్జున్ ఎలాంటి సెన్సేషనల్ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారో చూడాలి.
