దుబాయ్ ఎందుకు మన స్టార్లకు ఫేవరెట్?
టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ ఏడాదంతా ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 21 Nov 2025 9:00 PM ISTటాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ ఏడాదంతా ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. నెలల తరబడి కఠినమైన షెడ్యూళ్లను ప్లాన్ చేస్తూ దర్శకులు హీరోలను బాగా హింసిస్తున్నారు. ఇటీవల వారణాసి కోసం సెన్సిటివ్ బోయ్ మహేష్ ని అతడితో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ , ప్రియాంక చోప్రాను రాజమౌళి బాగా హింసించాడు. ఈ విషయాన్ని టైటిల్ లాంచ్ వేదికపై పృథ్వీరాజ్ దాచుకోకుండా ఓపెనయ్యాడు. రాజమౌళితో టార్చర్ భరించాను అనేసాడు.
ఇది కేవలం ఒక్క రాజమౌళితోనే కాదు... సుకుమార్ సహా చాలా మంది పెద్ద దర్శకులు హీరోలను తమకు కావాల్సిన విధంగా మలుచుకునేందుకు చాలా తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంతకుముందు పుష్ప ఫ్రాంఛైజీ కోసం సుకుమార్ తో సుదీర్ఘ షెడ్యూళ్లకు పని చేసాడు. కొండ కోనలు, అడవుల్లో తిరిగి షూటింగ్ చేసారు. ఇప్పుడు అట్లీతో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పెద్ది సినిమా కోసం చాలా చెమటోడ్చి పని చేస్తున్నాడు. బుచ్చిబాబు సనా రాజీ అన్నదే లేకుండా అతడితో వర్కవుట్లు చేయిస్తున్నాడు.
అయితే మహేష్, చరణ్, అల్లు అర్జున్ లకు కామన్ గా ఒక అలవాటు ఉంది. తమకు ఎప్పుడు ఒత్తిడిగా అనిపించినా వీళ్లు రిలాక్స్ అయ్యేందుకు డెస్టినేషన్ గా దుబాయ్ ని ఎంపిక చేసుకుంటారు. మహేష్ గతంలో చాలాసార్లు నమ్రత సహా పిల్లలతో కలిసి దుబాయ్ కి వెకేషన్ కి వెళ్లారు. చరణ్, బన్నీకి కూడా ఇది అలవాటు. ఇప్పుడు మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పని నుండి కొద్దిసేపు విరామం తీసుకుని దుబాయ్‌లో తన కుటుంబంతో గడుపుతున్నాడు. భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హాతో కలిసి బన్ని దుబాయ్ లో విహరిస్తున్నాడు. బేబి అర్హ పుట్టినరోజు సందర్భంగా కుటుంబం ఇలా ప్రత్యేకించి వెకేషన్ ని ప్లాన్ చేసింది. ఈ టూర్ ముగించి బన్ని తిరిగి సోమవారం నుంచి అట్లీతో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభిస్తాడు. ఈ మూవీలో దీపిక, మృణాల్ కథానాయికలు. 2027వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. భారీ వీఎఫ్ ఎక్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎక్కువ సమయం పోస్ట్ ప్రొడక్షన్ కి అవసరం.
అల్లు అర్జున్, మహేష్, చరణ్ లాంటి స్టార్లు దుబాయ్ కి వెళ్లడానికి కారణం, కేవలం విహారయాత్ర కోసమే కాదు. అక్కడ దర్శకరచయితలతో స్టోరి సిట్టింగ్స్ కూడా వేస్తుంటారని గతంలో కథనాలొచ్చాయి. ఎగ్జోటిక్ డెస్టినేషన్ లో వీరంతా కథా చర్చలు సాగిస్తే ఔట్ పుట్ తో పాటు మూడ్ బావుంటుందని భావిస్తారని కథనాలొచ్చాయి.
