ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్టర్ టైటిల్!
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రాకా’ తర్వాత బన్నీ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
By: Srikanth Kontham | 12 Nov 2026 7:23 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగతి తెలిసిందే. బన్నీ `రాకా` నుంచి రిలీవ్ అవ్వగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే లోకేష్ బన్నీ ఇమేజ్ కు తగ్గ కథను సిద్దం చేసి ఉంచారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనుల్లోనే లోకేష్ బిజీగా ఉన్నారు. లోకేష్ గత చిత్రాలు `లియో`, `కూలీ`లు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా? వాటిని అందు కోవడంలో విఫలమవ్వడంతో తదుపరి చిత్రంతో హిట్ అందుకుని రేసులో నిలవాలని రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
ఈ నేనపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. అల్లు అర్జున్ ఇమేజ్‌కు..లోకేష్ మార్క్ యాక్షన్ శైలికి తగ్గట్టుగా పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
`పుష్ప` సిరీస్‌తో మాస్ ఆడియన్స్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న బన్నీని మరోసారి పవర్‌ఫుల్ రా అండ్ రస్టిక్ అవతార్‌లో చూపించడానికి లోకేష్ సిద్ధమవుతున్నారు. సాధారణంగా సినిమాలకు క్యాచీగా, మాస్ అప్పీల్ ఉన్న టైటిల్స్ పెట్టే లోకేష్ ఈసారి బన్నీ అలాంటి టైటిల్‌నే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కథా నేపథ్యం.. బన్నీ పాత్రకు ఈ టైటిల్ వంద శాతం యాప్ట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోందట. గ్యాంగ్ స్టర్ కోణంలో టైటిల్ ఉంటుందనే వార్త అంతకంతకు హైప్ పెంచుతుంది. `పుష్ప`తో బన్నీ మాస్ ఇమేజ్ కు పీక్స్ చేరిన నేపథ్యంలో లోకేష్ ఆ ఇమేజ్ ను రెట్టింపు చేసేలా ఉండాలి. పైగా `రాకా` తర్వాత బన్నీ మార్కెట్ గ్లోబల్ వైడ్ కనెక్ట్ అవుతుంది. ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే లోకేష్ ప్రాజెక్ట్ ను డీల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ లోకేష్ కనగరాజ్ యూనివర్శ్ నుంచి రిలీజ్ అయిన `ఖైదీ`, `విక్రమ్`, `లియో`లతో దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.
డ్రగ్స్ మాఫియా, గ్యాంగ్‌స్టర్ వార్స్ నేపథ్యంలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి దర్శకుడి చేతికి అల్లు అర్జున్ లాంటి మాస్ అప్పీల్ ఉన్న నటుడు తోడవ్వడంతో సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనే దానిపై సర్వాత్ర చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతి ష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బన్నీ లుక్ ..బాడీ లాంగ్వేజ్‌పై లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే లోకేష్ `డీసీ`తో హీరోగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరడంతో? నటుడిగానూ లోకేష్ ఇదే సినిమాలో కీలక పాత్ర పోషించినా? ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
