లోకేష్ కనకరాజ్ 'పుష్ప' ఎలా ఉంటాడు..?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పై కూలీ సినిమా ఇంపాక్ట్ బాగా పడిందని తెలిసిందే. కూలీ సినిమా పై కోలీవుడ్ ఆడియన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోగా సినిమా డిజప్పాయింట్ చేసింది.
By: Ramesh Boddu | 5 Jan 2026 12:08 PM ISTకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పై కూలీ సినిమా ఇంపాక్ట్ బాగా పడిందని తెలిసిందే. కూలీ సినిమా పై కోలీవుడ్ ఆడియన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోగా సినిమా డిజప్పాయింట్ చేసింది. ఐతే లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. అసలైతే అమీర్ ఖాన్ తో ఒక సినిమా.. రజనీ, కమల్ తో సినిమా.. కార్తితో ఖైదీ 2 ఇలా చాలా ప్లానింగ్ తోనే ఉన్న లోకేష్ కి ఈ 3 సినిమాలు కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ లాక్ అయినట్టు తెలుస్తుంది.
లోకేష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్..
డైరెక్టర్ గా ఖైదీ, విక్రం సినిమాలతో తన మార్క్ చాటిన లోకేష్ కనకరాజ్ లియో, కూలీ సినిమాల విషయంలో ట్రాక్ తప్పాడు. ఐతే నెక్స్ట్ సినిమాతో లోకేష్ మరోసారి తన ఒరిజినాలిటీ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. లోకేష్ డైరెక్షన్ గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇరుంబు బై మాయావి ని తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. ఐతే ఈసారి లోకేష్ మన తెలుగు స్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
కొన్నాళ్లుగా డిస్కషన్ లో ఉన్నట్టుగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనే లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ తో లోకేష్ సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే. పుష్ప మేకర్స్ మైత్రి మేకర్స్ ఈ కాంబినేషన్ ని ఫిక్స్ చేశారట. విక్రం రిజల్ట్ చూసే లోకేష్ కి ఫ్యాన్సీ అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి మేకర్స్ అల్లు అర్జున్ తో సినిమాకు లైన్ చేస్తున్నారట.
అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా..
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది. లోకేష్ అల్లు అర్జున్ సినిమా అనగానే ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి. ఐతే ఈసారి లోకేష్ కనకరాజ్ పుష్ప హీరోని ఎలా చూపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ కూడా లోకేష్ తో సినిమా విషయంలో మంచి ప్లానింగ్ తో వస్తున్నారట.
ఐతే అట్లీ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రంతో సినిమా చేస్తాడని వార్తలు రాగా సడెన్ గా లోకేష్ ఎంట్రీ అల్లు ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. వెంకటేష్ ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తోనే మైథాలజీ సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ లోకేష్ రావడంతో మరోసారి ఆర్డర్ అటు ఇటు అవుతుంది. ఐతే త్రివిక్రమ్ సినిమాకు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సి ఉంది. అందుకే ఈలోగా లోకేష్ సినిమా కూడా పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నాడు అల్లు అర్జున్. మొత్తానికి అట్లీ, లోకేష్, త్రివిక్రమ్ అల్లు అర్జున్ మాస్ లైనప్ ఫ్యాన్స్ కి ఒక క్రేజీ ఫీస్ట్ అందించేలా ఉంది.
