Begin typing your search above and press return to search.

ఒక్క సిట్టింగ్‌ తో తేల్చేసిన బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌ లో సినిమా ఉంటుందా లేదా అనే డౌట్స్ కు ఇప్పుడు ఒక్క ఫొటోతోనే ఆన్సర్ దొరికింది.

By:  M Prashanth   |   12 Oct 2026 7:48 PM IST
ఒక్క సిట్టింగ్‌ తో తేల్చేసిన బన్నీ
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌ లో సినిమా ఉంటుందా లేదా అనే డౌట్స్ కు ఇప్పుడు ఒక్క ఫొటోతోనే ఆన్సర్ దొరికింది. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు స్వయంగా దర్శకుడే అల్లు అర్జున్‌ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు, త్వరలోనే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయని ప్రకటించారు. దీంతో బన్నీ అభిమానుల్లో మళ్లీ జోష్ మొదలైంది.

అల్లు అర్జున్ లీడ్ రోల్ లో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో AA23 తెరకెక్కనున్నట్లు కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఆ కాంబినేషన్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మూవీకి రాక్‌ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే అనౌన్స్మెంట్ తర్వాత సినిమా గురించి పెద్దగా వివరాలు బయటకు రాకపోవడంతో రకరకాల వార్తలు మొదలయ్యాయి.

లోకేశ్ చెప్పిన స్టోరీ అల్లు అర్జున్‌కు నచ్చలేదని, దీంతో సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లడంతో బన్నీ ఇతర దర్శకులతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిపై మూవీ టీమ్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ రీసెంట్ గా లోకేశ్ చేసిన పోస్ట్‌ తో ఆ రూమర్స్ కు చెక్ పడినట్లయింది.

దర్శకుడు షేర్ చేసిన ఫొటోలో అల్లు అర్జున్‌తో ఆయన ఏదో విషయం గురించి డిస్కస్ చేస్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. బన్నీ వింటుండగా.. లోకేశ్ తన ఆలోచనలను వివరిస్తున్నట్లు ఆ ఫొటో ఉంది. దీనికి తోడు త్వరలోనే అప్డేట్స్ వస్తాయని ఆయన చెప్పడంతో ఆ సిట్టింగ్ కు ఇంపార్టెన్స్ వచ్చింది. అయితే కొత్తగా ఏ విషయం ఫిక్స్ అయింది, నెక్స్ట్ అప్డేట్ ఏమిటనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న రాకా మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఆయన లోకేశ్ ప్రాజెక్ట్‌ పై బన్నీ దృష్టి పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో AA23 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే తెలియదు. అయితే బన్నీ స్టైల్, లోకేశ్ యాక్షన్ కలిస్తే సిల్వర్ స్క్రీన్ పై కొత్త ఎక్స్ప్రీరియన్స్ వస్తుందని ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ఆశిస్తున్నారు.

సినిమా అనౌన్స్మెంట్ వీడియోకు అనిరుధ్ అందించిన 23 థీమ్ కూడా అప్పట్లో వారిలో హైప్ పెంచింది. అయితే మూవీ స్టోరీ, టైటిల్, క్యాస్టింగ్, రిలీజ్ డేట్ వంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇప్పటివరకు వినిపించిన వార్తలకు భిన్నంగా.. దర్శకుడే బన్నీతో చర్చల్లో ఉన్న పిక్ షేర్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అయితే నెక్స్ట్ అప్డేట్ ద్వారా టైటిల్ ప్రకటిస్తారా, ఫస్ట్ లుక్ విడుదల చేస్తారా, లేక షూటింగ్ వివరాలు వెల్లడిస్తారా అనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.