Begin typing your search above and press return to search.

లోకేష్ కోసం బన్నీ డెడికేషన్.. ఇండస్ట్రీలో హాట్ టాక్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్‌లో రికార్డులు సృష్టించేందుకు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు.

By:  Madhu Reddy   |   25 Jun 2026 6:00 PM IST
లోకేష్ కోసం బన్నీ డెడికేషన్.. ఇండస్ట్రీలో హాట్ టాక్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్‌లో రికార్డులు సృష్టించేందుకు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. పుష్ప సిరీస్ తర్వాత ఆయన మార్కెట్ నెక్స్ట్ లెవెల్‌కి చేరడంతో టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా టాప్ డైరెక్టర్స్ అందరూ బన్నీతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఈ లైన్‌లోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘AA23’పై ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ మూవీకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, సినిమా పనులు కూడా శరవేగంగా నడుస్తున్నాయి.

ముంబైలో లుక్ టెస్ట్.. సరికొత్త మేకోవర్:

లోకేష్ కనకరాజ్ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్, వారి లుక్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను మునుపెన్నడూ చూడని ఒక విభిన్నమైన, అడ్వెంచరస్ రోల్‌లో చూపించబోతున్నారట. ఇందుకోసం జూన్ 26న ముంబైలో అల్లు అర్జున్‌కు ఒక కీలకమైన 'లుక్ టెస్ట్' నిర్వహించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక లోకేష్ ఆల్రెడీ కొన్ని అదిరిపోయే లుక్స్‌ను లాక్ చేశారని, ఈ టెస్ట్ తర్వాత బన్నీ ఫైనల్ గెటప్ ఏంటనేది ఫిక్స్ అవుతుందని తెలుస్తోంది.

అనిరుధ్ మ్యూజిక్.. అంచనాలు పీక్స్:

ఈ భారీ స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు. లోకేష్ కనకరాజ్-అనిరుధ్ కాంబోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఇక దానికి అల్లు అర్జున్ స్వైప్ తోడైతే థియేటర్లలో పూనకాలే. ఇప్పటికే లోకేష్ కనకరాజ్ తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దేసారని, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు వచ్చాయని సమాచారం. ఇక ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

'రాకా' సెట్స్‌పై ఉంటూనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్:

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్‌పై ఉంటూనే, బన్నీ తన తదుపరి చిత్రం ‘AA23’పై కూడా ఫోకస్ పెట్టి ఫాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ ఇస్తున్నారు.

అల్లు అర్జున్ మాస్ స్వాగ్, లోకేష్ కనకరాజ్ పవర్‌ఫుల్ టేకింగ్, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వస్తున్నాయి. రేపు జరగబోయే లుక్ టెస్ట్‌తో ఈ ప్రాజెక్ట్ మరింత ముందుకు కదలనుంది. ఇక మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఎలాంటి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి..