'రాకా'కు అదే బిగ్గెస్ట్ ప్రమోషన్ కానుందా?
పాన్ ఇండియా సినిమా అంటే కేవలం థియేటర్లలో రిలీజ్ చేస్తే సరిపోదు. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచేలా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ఉండాలి.
By: M Prashanth | 3 Oct 2026 3:31 PM ISTపాన్ ఇండియా సినిమా అంటే కేవలం థియేటర్లలో రిలీజ్ చేస్తే సరిపోదు. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచేలా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రాకా సినిమాకు అలాంటి ఓ భారీ ప్రమోషనల్ స్టేజ్ దొరికే ఛాన్స్ కనిపిస్తోంది. అదే కాఫీ విత్ కరణ్. ఆ ఫేమస్ టాక్ షో లాస్ట్ సీజన్ లో బన్నీ గెస్ట్ గా కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. కరణ్ జోహార్ హోస్ట్ గా నిర్వహించే ఆ షోలో బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రముఖులు కూడా పాల్గొంటుంటారు. సెలబ్రిటీలు చెప్పే విషయాలు, షోలో జరిగే కన్వర్జేషన్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుతుంటాయి. అందుకే ఆ షోలో కనిపించడం అంటే నేషనల్ లెవల్ లో మంచి ప్రమోషన్ దక్కినట్టే.
ఇక ఆ షోకు సంబంధించిన తొమ్మిదో సీజన్ అక్టోబర్ 14వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో ప్రారంభం కానుంది. ఇదే చివరి సీజన్ అని కరణ్ జోహార్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. దీంతో ఆ సీజన్ పై మరింత ఇంట్రెస్ట్ నెలకొంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఆ షోలో గెస్ట్ గా వస్తే రాకా మూవీకి అది ఎక్స్ ట్రా ప్రమోషన్ గా మారే అవకాశం ఉంది.
పుష్ప సినిమాతో బన్నీకి హిందీ మార్కెట్ లో భారీ గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆయనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే ‘కాఫీ విత్ కరణ్ లాంటి బాలీవుడ్ కు బాగా కనెక్ట్ అయిన షో ద్వారా అక్కడి ప్రేక్షకులకు బన్నీ మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. షోలో ఆయన మాట్లాడే విషయాలు, సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు రాకా కూడా భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమా. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఆ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రెండు పార్టులుగా ఆ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం కూడా ఉంది. ఫస్ట్ పార్ట్ 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సినిమా విడుదలకు చాలా ముందుగానే ప్రమోషనల్ ప్లాన్ మొదలుపెట్టే అవకాశం ఉంది.
అట్లీకి కూడా బాలీవుడ్ మార్కెట్ తో మంచి పరిచయం ఉంది. షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ సినిమాతో ఆయనకు నార్త్ లో భారీ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తుండటంతో ‘రాకాపై అటు సౌత్, ఇటు నార్త్ ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. అలాంటి సమయంలో కరణ్ జోహార్ షోలో అల్లు అర్జున్ కనిపిస్తే.. రాకా మూవీకి రిలీజ్ కు చాలా ముందే నేషనల్ లెవల్ లో భారీగా హైప్ తీసుకురావడానికి యూజ్ అవుతుందని చెప్పాలి.
