Begin typing your search above and press return to search.

అనిరుధ్ పెళ్లికి టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒక్కరేనా?

భారతీయ సినీ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ల వివాహ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

By:  Madhu Reddy   |   29 Oct 2026 10:04 AM IST
అనిరుధ్ పెళ్లికి టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒక్కరేనా?
X

భారతీయ సినీ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ల వివాహ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ రాయల్ వెడ్డింగ్‌కు సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ నుంచి కేవలం ఐకాన్ స్టార్ కు మాత్రమే ఆహ్వానం అందిందనే వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఆ వివరాలు చూద్దాం..

గ్రీస్‌లో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్:

అనిరుధ్, కావ్య మారన్‌ల పెళ్లి నవంబర్ 10, 11 తేదీల్లో జరగనుందని సమాచారం. గ్రీస్‌లోని అందమైన ప్రదేశంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లిని ప్రైవేట్‌గా, ఘనంగా జరిపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

చెన్నైలో తారల మెరుపులు.. గ్రాండ్ రిసెప్షన్:

వివాహం ముగిసిన తర్వాత నవంబర్ 21న చెన్నైలోని ప్రముఖ ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌లో అత్యంత వైభవంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కోలీవుడ్ నుంచి అనిరుధ్ మేనమామ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, అజిత్ కుమార్, శివకార్తికేయన్, ఏఆర్ రెహమాన్, నెల్సన్ వంటి దిగ్గజాలు హాజరుకానున్నారు.

టాలీవుడ్ నుంచి బన్నీ ఒక్కడికే ఛాన్స్?:

ఈ భారీ వేడుకకు సంబంధించి టాలీవుడ్‌లో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కేవలం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మాత్రమే ప్రత్యేక ఆహ్వానం అందిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనిరుధ్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం వల్లే బన్నీ పేరు అతిథుల జాబితాలో ప్రముఖంగా నిలిచిందని అంటున్నారు.

మోదీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానం:

ఇక సన్ గ్రూప్ అధినేత, కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ ఈ పెళ్లిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, సోనియా గాంధీలతో పాటు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వంటి అగ్ర రాజకీయ నాయకులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.

క్రీడా, సినీ దిగ్గజాల సమాగమం:

ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టీమ్‌ల యజమానులు, ప్రముఖ క్రికెటర్లు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. ఇలా మూడు రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే చోట చేరనుండటంతో అనిరుధ్, కావ్య మారన్‌ల పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్, ఐపీఎల్‌లో తన మార్క్ చూపించిన కావ్య మారన్ ఒకటవుతుండటం అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తోంది. నవంబర్‌లో జరగనున్న ఈ పెళ్లి వేడుక సినీ, వ్యాపార రంగాల్లో ప్రత్యేకంగా నిలిచిపోనుంది.