'హ్యాపీ'కి 20 ఏళ్లు.. తెలుగులోనే కాదు కేరళలో కూడా రికార్డు!
సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తమ కెరియర్ లో బెస్ట్ గా నిలిచిన చిత్రాల గురించి ఎప్పుడు మరిచిపోరనే చెప్పాలి.
By: Madhu Reddy | 27 Jan 2026 6:49 PM ISTసినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తమ కెరియర్ లో బెస్ట్ గా నిలిచిన చిత్రాల గురించి ఎప్పుడు మరిచిపోరనే చెప్పాలి. అందులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం పాన్ వరల్డ్ చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ.. తన కెరియర్లో తనకు సంతృప్తిని ఇచ్చిన ఫిలిం అదేనని.. ఆ సినిమాకి నేటితో 20 సంవత్సరాలు పూర్తయ్యాయని గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన కరుణాకర్ కు కృతజ్ఞతలు అంటూ బన్నీ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.
20 ఏళ్ల నాటి గుర్తులను షేర్ చేసుకున్న బన్నీ..
ఈ మేరకు అల్లు అర్జున్ పోస్ట్ చేస్తూ.. "నా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన హీరోయిన్ జెనీలియా, టాలెంటెడ్ మనోజ్ భాజ్ పాయ్, నాతోపాటు ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు కలిసి ఈ ప్రయాణాన్ని మరిచిపోలేనిదిగా తీర్చిదిద్దారు. హృదయాన్ని హత్తుకునే సంగీతం అందించినందుకు యువన్ రాజాకు, సాంకేతిక నిపుణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టుకి అండగా నిలిచిన మా నాన్న అల్లు అరవింద్ కి, గీత ఆర్ట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.
ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.అంతేకాదు సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలని తన జ్ఞాపకాలుగా షేర్ చేశారు బన్నీ. ప్రస్తుతం బన్నీ షేర్ చేసిన ఈ ఫోటోలతో పాటు పెట్టిన పోస్ట్.. ఇచ్చిన క్యాప్షన్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన పలు రికార్డ్స్ ను కూడా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
హ్యాపీ సినిమా సాధించిన రికార్డ్స్..
మరి ఈ సినిమా సాధించిన రికార్డ్స్ విషయానికి వస్తే.. 2006 జనవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా దర్శకత్వం వహించారు . రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా విడుదలైన సమయంలో అనేక రికార్డ్స్ క్రియేట్ చేసింది. కేరళలో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . పైగా 175 రోజులకు పైగా ప్రదర్శితమైంది.హ్యాపీ బి హ్యాపీ అంటూ అక్కడి ఆడియన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. అంతేకాదు ఆ సమయంలో కేరళలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన తెలుగు డబ్బింగ్ చిత్రంగా నిలిచింది.
అంతేకాదు 21 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితం అందుకున్న మూవీగా రికార్డు అందుకుంది. ఈ సినిమా విజయంతో దీనిని బెంగాలీలో 'బోలో నా తుమీ ఆమర్' అంటూ 2010లో రీమేక్ చేయగా.. ఒడియాలో 'లోఫర్' పేరుతో 2011లో రీమేక్ చేశారు.
అల్లు అర్జున్ ప్రస్తుత సినిమాలు..
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా 2027 సమ్మర్ టార్గెట్ గా విడుదలకు సిద్ధమవుతోంది.
