అల్లు శిరీష్ కోసం బన్నీ ప్రైవేట్ పార్టీ.. ఇండస్ట్రీ అతిథులు వీరే!
హిందూ సాంప్రదాయం ప్రకారం 19 ఫిబ్రవరి 2026 నుండి పెళ్లిళ్ల సీజన్ మొదలైన విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 21 Feb 2026 1:03 PM ISTహిందూ సాంప్రదాయం ప్రకారం 19 ఫిబ్రవరి 2026 నుండి పెళ్లిళ్ల సీజన్ మొదలైన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే సామాన్యులతో పాటు ఇటు సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరిగా బ్యాచిలర్ లైఫ్ ని వీడి కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నారు. అటు ఇప్పటికే విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లికి సిద్ధమవుతుండగా.. ఇటు అల్లు శిరీష్ కూడా తన ప్రేయసి నయానికా రెడ్డితో ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక అందులో భాగంగానే ముందస్తు పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
మార్చి 6వ తేదీన కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అల్లు శిరీష్ , నయానిక రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడే ప్రీ వెడ్డింగ్ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే దుబాయిలో అల్లు శిరీష్ తన కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ప్రత్యేకంగా గ్రాండ్ పార్టీని నిర్వహించారు . అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇక ఇప్పుడు తన తమ్ముడి పెళ్లి కాబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలకు హైదరాబాద్ వేదికగా గ్రాండ్ గా ఒక ప్రైవేట్ పార్టీ నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి తమ్ముడి పెళ్లికి ముందస్తుగానే అల్లు అర్జున్ ఇచ్చిన ఈ పార్టీకి ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు అతిథులుగా వచ్చారు అనే విషయం కూడా వైరల్ గా మారుతోంది.
తాజాగా ఈ పార్టీ నుండి బయటకు వచ్చిన ఫోటోలను మనం గమనించినట్లయితే.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఉపాసన జనవరి 31న పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. రెండవసారి తల్లి అయిన తర్వాత ఆమె హాజరైన మొదటి పార్టీ కూడా ఇదే కావడం గమనార్హం. రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డి, అల్లు శిరీష్ తన కాబోయే భార్య నయానిక రెడ్డితో పాటు రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. వీరందరూ కూడా బ్లాక్ డ్రెస్ కోడ్ లో కనిపించి సందడి చేశారు. ఈ జంటల గ్రూప్ ఫోటో అందరినీ ఆకర్షిస్తోంది కూడా.
మరోవైపు ఈ పార్టీకి విచ్చేసిన అతిధుల విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్టార్ దగ్గుపాటి రానా సతీమణి మిహికా బజాజ్, యంగ్ బ్యూటీ శ్రీ లీల, ఫరియా అబ్దుల్లా, సిద్దు జొన్నలగడ్డ, అక్కినేని సుశాంత్, సందీప్ కిషన్, తేజ సజ్జ, కృతి శెట్టి, నిధి అగర్వాల్, రాశిఖన్నా తదితరులు ఈవెంట్ కి హాజరయ్యారు . ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ సెలబ్రిటీలలో చాలామంది బ్లాక్ డ్రెస్ కోడ్ ను ఫాలో అయ్యారు. మొత్తానికైతే బన్నీ ఇచ్చిన ఈ గ్రాండ్ ప్రైవేట్ పార్టీలో సెలబ్రిటీలంతా కూడా సందడి చేశారు.
Photos Credit : RobbReport Magazine
