Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ నుంచి గ్లోబ‌ల్ ఐకాన్ గా!

`పుష్ప`తో ఇప్పటికే పాన్-ఇండియా మార్కెట్‌ను శాసించిన బన్నీ, రాబోయే చిత్రాలతో తన ప్రభావాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

By:  Srikanth Kontham   |   12 March 2026 4:00 AM IST
ఐకాన్ స్టార్ నుంచి గ్లోబ‌ల్ ఐకాన్ గా!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. రాబోయే ఐదేళ్లలో ఆయన లైనప్‌లో ఉన్న సినిమాలన్నీ అనుకున్నట్లుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే టాలీవుడ్ స్టార్‌గానే కాకుండా, భారతీయ చిత్ర పరిశ్రమలోనే అజేయమైన గ్లోబల్ ఐకాన్ గా ఎదిగే అవ‌కాశం ఉంది. `పుష్ప`తో ఇప్పటికే పాన్-ఇండియా మార్కెట్‌ను శాసించిన బన్నీ, రాబోయే చిత్రాలతో తన ప్రభావాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

వచ్చే ఐదేళ్లలో ఆయన లోకేష్ క‌న‌గ‌రాజ్, సుకుమార్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా వంటి అగ్ర దర్శకులతో చేయబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వరకు వసూళ్లను సాధించే అవకాశం ఉంది. అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌రిగితే గ‌నుక‌ భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా బ‌న్నీ నిలుస్తారు. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో బ‌న్నీకి ఉన్న క్రేజ్ అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ రేంజ్‌కు చేరుకోవడమే కాకుండా, సౌత్ నుంచి నార్త్ వరకు ఏకఛత్రాధిపత్యం వహించే మెగా పాన్-ఇండియా సూపర్ స్టార్ గా బ‌న్నీ అవతరిస్తారు.

సాంకేతికంగా , నటన పరంగా కూడా బన్నీ స‌రి కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. త్రివిక్రమ్ సినిమాతో విజువల్ వండర్స్, సందీప్ వంగాతో రా అండ్ రస్టిక్ యాక్షన్ వంటి వైవిధ్యమైన జోనర్లు చేయడం వల్ల, ఆయన నటనలో ఉన్న అన్ని కోణాలు ప్రపంచానికి పరిచయమవుతాయి. ఇది కేవలం బాక్సాఫీస్ నంబర్లకే పరిమితం కాకుండా, గ్లోబల్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ,అంతర్జాతీయ చలనచిత్ర వేదికలపై భారతీయ సినిమాకు ప్రతినిధిగా అల్లు అర్జున్‌ని నిలబెడుతుంది. రాజమౌళి సినిమాల తర్వాత ఆ స్థాయి ప్రభావాన్ని చూపగల సత్తా ఉన్న హీరోగా బన్నీ పేరు మారుమోగిపోతుంది.

ఈ ఐదేళ్ల విజయ పరంపర అల్లు అర్జున్‌ను టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో తిరుగులేని వ్యక్తిగా మార్చేస్తుంది. రికార్డులే కాకుండా, తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుని, భవిష్యత్ తరాల నటులకు ఒక రోల్ మోడల్‌గా నిలిచే అవ‌కాశాలున్నాయి. 2030 నాటికి భారతీయ చిత్ర పరిశ్రమ గురించి ఎక్కడ చర్చ జరిగినా? అల్లు అర్జున్ పేరు మొదటి వరుసలో ఉండటం ఖాయం. ఆ విజయం ఆయనను కేవలం ఒక నటుడిగానే కాకుండా, సినిమా మార్కెట్‌ను శాసించే ఒక మహోన్నత శక్తిగా తీర్చిదిద్దుతుంది. ప్ర‌స్తుతం బ‌న్నీ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీతో క‌లిసి ఓ గ్లోబ‌ల్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బ‌న్నీ మూడు-నాలుగు గెట‌ప్స్ లో క‌నిపించ నున్నాడు? అన్న ప్ర‌చారం సినిమాకు అంత‌కంత‌కు హైప్ తీసుకొస్తుంది. పాన్ వ‌ర‌ల్డ్ లో ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.