మహారాష్ట్రలో బన్నీ ఫ్యాన్స్.. ఇప్పుడు 10 జిల్లాలకు..
అల్లు అర్జున్ ఫ్యాన్స్ యాక్టివిటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దాటి మరో లెవెల్‌కు వెళ్తోంది.
By: M Prashanth | 6 Oct 2026 9:49 PM ISTఅల్లు అర్జున్ ఫ్యాన్స్ యాక్టివిటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దాటి మరో లెవెల్‌కు వెళ్తోంది. మహారాష్ట్రలో అభిమానులను ఒకే గ్రూప్‌గా ఉంచడం కాకుండా, రాష్ట్రం నుంచి జిల్లాల వరకు టీమ్స్‌గా సెట్ చేస్తున్నారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మహారాష్ట్ర స్టేట్ కమిటీని అధికారికంగా ఏర్పాటు చేశారు. సినిమా రిలీజ్ టైమ్‌లో హడావుడి చేసే ఫ్యాన్ క్లబ్‌గా కాకుండా, ఏడాది మొత్తం యాక్టివ్‌గా ఉండే నెట్‌వర్క్‌గా తీసుకెళ్లాలనే ప్లాన్లా కనిపిస్తోంది.
స్టేట్ కమిటీతో పాటు పది ప్రాంతాల్లో జిల్లా కమిటీలను కూడా ఒకేసారి ఏర్పాటు చేశారు. పర్భణి, నాందేడ్, ముంబై, పుణె, పాలం, హింగోలి, ఉమ్రి, సోలాపూర్, గడ్చిరోలి, షిర్డీలో కొత్త టీమ్స్ వచ్చాయి. ఒక తెలుగు హీరో ఫ్యాన్ అసోసియేషన్ మహారాష్ట్రలో ఇలా జిల్లాల వారీగా విస్తరించడం స్పెషల్. పుష్ప తర్వాత బన్నీకి అక్కడ పెరిగిన ఫాలోయింగ్ ఇప్పుడు పోస్టర్లు, సెలబ్రేషన్స్ దాటి ఆర్గనైజ్డ్ ఫ్యాన్ నెట్‌వర్క్‌గా మారుతోంది.
ఫ్యాన్ అసోసియేషన్ అంటే బర్త్‌డే రోజున కేక్ కట్ చేయడం, సినిమా రిలీజ్‌కు బ్యానర్లు కట్టడం, ఫస్ట్ డే షోలో సందడి చేయడం వరకు ఆగిపోవడం కామన్. కానీ ఏఏఎఫ్ఏ ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్‌ను కూడా తమ ప్లాన్‌లో భాగం చేస్తోంది. ప్రత్యేకంగా హెచ్‌పీవీ అవేర్‌నెస్‌పై పని చేస్తామని ప్రకటించారు. నివారణ, వ్యాక్సినేషన్ గురించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
“వన్ గుడ్ డీడ్ ఎవరీ ఇయర్” అనే కాన్సెప్ట్‌తో ప్రతి ఏడాది అభిమానుల ద్వారా ఒక మంచి కార్యక్రమం చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. హీరో పేరుతో ఏర్పడిన ఫ్యాన్ బేస్‌ను సోషల్ వర్క్‌కు కూడా ఉపయోగించాలనే ఆలోచన ఇందులో ఉంది. సినిమా వచ్చినప్పుడు మాత్రమే కలిసే అభిమానులను, మిగతా టైమ్‌లో కూడా ఏదో ఒక పనితో కలిపి ఉంచడం ఈ మోడల్‌లో మరో పాయింట్.
మహారాష్ట్రలో ఎంపిక చేసిన ప్రాంతాలు కూడా చూస్తే ముంబై, పుణెతో కథ ఆగలేదు. గడ్చిరోలి, హింగోలి, ఉమ్రి, పర్భణి వంటి ప్రాంతాలకు కూడా కమిటీలు వెళ్లాయి. అంటే పెద్ద నగరాల్లో ఉన్న ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగడం వరకే ప్లాన్ పెట్టలేదు. జిల్లా స్థాయిలో ఎవరు పని చేయాలి, కార్యక్రమాలు ఎలా తీసుకెళ్లాలి అన్నదానికి ఒక స్ట్రక్చర్ తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలు చేరితే ఈ నెట్‌వర్క్ ఇంకా పెద్దదవుతుంది.
అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌లో ఉన్న హీరో. ఆ క్రేజ్ సినిమా కలెక్షన్లలో కనిపించడం ఒక భాగం అయితే, ఇతర రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఇలా ఆర్గనైజ్ అవడం మరో మార్పు. మహారాష్ట్రలో పది కమిటీలతో మొదలైన ఈ సెటప్‌లో అసలు చూడాల్సింది వాళ్లు చేసే కార్యక్రమాలే. హెచ్‌పీవీ అవేర్‌నెస్‌ను ఎంత విస్తృతంగా తీసుకెళ్తారు, “వన్ గుడ్ డీడ్” కాన్సెప్ట్‌ను ప్రతి ఏడాది ఎలా కొనసాగిస్తారు అన్నదే ఈ ఫ్యాన్ అసోసియేషన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే విషయం. అదే ఇప్పుడు ఈ టీమ్‌కు అసలు వర్క్.
