Begin typing your search above and press return to search.

80ల ట్రెండ్ రిపీట్.. ఈ జనరేషన్లో ఫ్యాన్స్ సంఘాలు ఉన్న హీరోలు వీళ్లే!

అల్లు అర్జున్ ఆదివారం రోజు హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్లో తన అభిమానులందరినీ పర్సనల్ గా కలుసుకొని వారితో మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు.

By:  Madhu Reddy   |   13 Oct 2025 10:14 AM IST
80ల ట్రెండ్ రిపీట్.. ఈ జనరేషన్లో ఫ్యాన్స్ సంఘాలు ఉన్న హీరోలు వీళ్లే!
X

అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో ఎక్కువ వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా గత ఏడాదిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయం నుండి మెగా ఫ్యామిలీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అలా గత కొద్దిరోజుల నుండి మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు రాజుకున్నా.. ఇటీవల అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనక రత్నమ్మ మరణం తర్వాత ఈ రెండు కుటుంబాలు కలిసిపోయాయి. అంతేకాదు ప్రతి అకేషన్లో రెండు ఫ్యామిలీలు కలిసి సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మరోవైపు తాజాగా.. బన్నీ అభిమానులు.. ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ క్లబ్ ని ఏర్పాటు చేసుకున్నారు.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అల్లు అర్జున్ ఆదివారం రోజు హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్లో తన అభిమానులందరినీ పర్సనల్ గా కలుసుకొని వారితో మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఆర్మీని బలోపేతం చేయడం కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి యువ అభిమానులందరినీ తీసుకొని ఫ్యాన్స్ క్లబ్ ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ కోసం కొంతమంది సభ్యులను కూడా ఖరారు చేశారు. అలా ఏపీ,తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ కి కమిటీ సభ్యులను నియమించారు. వారందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

అయితే 80's లో ఎక్కువగా ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ క్లబ్బులు ఉండేవి. కానీ మళ్ళీ ఆ ట్రెండ్ ని తీసుకొచ్చారు అల్లు అర్జున్. అభిమాన సంఘాలు దాదాపు కనుమరుగవుతున్న టైం లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. మరి అల్లు అర్జున్ తో పాటు ఇప్పటి జనరేషన్లో ఏ ఏ హీరోలకు ఫ్యాన్స్ అసోసియేషన్, ఫ్యాన్ క్లబ్ లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తో పాటు ఇప్పటి జనరేషన్ హీరోలలో కొంతమందికి అఫీషియల్ గా కొన్ని ఫ్యాన్స్ క్లబ్ లు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులు ఉన్నారు. ఈయన ఫ్యాన్స్ క్లబ్ హైదరాబాద్ లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అసోసియేషన్ క్లబ్స్ ఉన్నాయి. అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్, పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్, ఆలిండియా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వంటివి ఉన్నాయి. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నప్పటికీ అవి అఫీషియల్ గా అయితే లేవు. రాంచరణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా శివ చెర్రీ కొనసాగుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. తండ్రిని ఆదరించిన చాలామంది మహేష్ కి కూడా ఫ్యాన్స్ అయిపోయారు. అలా మహేష్ కి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఫ్యాన్స్ క్లబ్స్ ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం ఏ లెవెల్ లో ఉందో చెప్పనక్కర్లేదు. అలాంటి ప్రభాస్ కి రెబల్ స్టార్ పేరుతో చాలా సంవత్సరాల నుండి ఫ్యాన్ బేస్ ఉంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి అర్జున్ రెడ్డి సినిమాతో భారీగా అభిమానులు అయ్యారు. అలా విజయ్ దేవరకొండ కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా చాలామందికి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండేవి. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ అసోసియేషన్స్ కనుమరుగవుతున్న టైంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధికారికంగా ఏర్పాటు చేసి కొత్త ట్రెండ్ సృష్టించారు.