అత్తమ్మతో అల్లు కోడళ్లు వెరీ స్పెషల్ దీపావళి
అల్లు కుటుంబం దీపావళి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను అల్లు శిరీష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. అల్లు అరవింద్‌తో అల్లు బ్రదర్స్, స్నేహారెడ్డి, నయనిక రెడ్డి, పిల్లలు కలిసి సందడి చేశారు. ముఖ్యంగా భార్య నయనికకు శిరీష్ ముద్దు పెడుతున్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంది.
By: Sivaji Kontham | 10 Nov 2026 9:21 AM ISTఈ దీపావళి చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా సెలబ్రిటీలు కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకుంటున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా షికార్ చేస్తున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా సినీకుటుంబాలు దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాయి. ప్రతియేటా దీపావళిని మెగా, అల్లు కుటుంబాలు సైతం వర్ణరంజితంగా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తున్నదే.
తాజాగా సకుటుంబ సమేతంగా అల్లు ఫ్యామిలీ దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ స్వయంగా ఈ ఫోటోగ్రాఫ్స్ ని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేయగా, అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అల్లు ఇంట కోడళ్ల సందడి మామూలుగా లేదు. కొన్ని ఫోటోగ్రాఫ్స్ లో అల్లు శిరీష్ సతీమణితో బన్ని కుమార్తె బేబి అర్హ, కుమారుడు అయాన్ ఎంతో సన్నిహితంగా కనిపించారు. ఒక ఫోటోగ్రాఫ్ లో అల్లు బ్రదర్స్ అంతా తమ గారాల డాడీ అల్లు అరవింద్ తో కలిసి ఫోజులిచ్చారు. అల్లు బాబి, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఈ ఫోటోగ్రాఫ్స్ లో కనిపించారు. అత్తగారితో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి, శిరీష్ సతీమణి నయనిక రెడ్డి ఫోజు ఇచ్చిన ఫోటో ఆల్బమ్ లో యూనిక్ గా కనిపిస్తోంది. శిరీష్ తన సతీమణి బుగ్గలపై ఛుమ్మా ఇచ్చిన ఫోటో వెరీ స్పెషల్.
ఈ సోషల్ మీడియా పోస్ట్ పై రకరకాల వ్యాఖ్యలతో నెటిజనులు విరుచుపడ్డారు. అభిమానులు `హ్యాపీ దీపావళి` చెబుతూ హార్ట్ ఎమోజీలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొందరు `జై బన్నీ` అంటూ నినదించారు. ఆసక్తికరంగా అల్లు బ్రదర్స్ కి విజ్ఞప్తి చేస్తూ కొందరు రచయితలు తమకు అవకాశాలివ్వాలని కూడా కోరారు. తమ వద్ద స్క్రిప్టులు ఉన్నాయని సెలబ్రిటీల దృష్టికి తీసుకెళ్లడానికి పదే పదే కామెంట్లుగా పోస్ట్ చేశారు. సాధారణ నెటిజన్లు కొందరు తమ ఆర్థిక ఇబ్బందులు, వైద్య సహాయం లేదా వ్యక్తిగత సమస్యల గురించి నేరుగా కామెంట్లలో సహాయం అభ్యర్థించారు.
అల్లు బాబి నిర్మాతగా కొనసాగడమే కాకుండా, అప్పుడప్పుడు నటనలోను సత్తా చాటుతున్నారు. శిరీష్ సొంత వ్యాపారాలతో తలమునకలుగా ఉన్నారు. నటుడిగా కెరీర్ ని పునరుద్ధరించే పనిలో ఉన్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ చిత్రం `రాకా`తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అతడి వేషధారణలు, నటన ఆడియెన్ కి స్పెషల్ ట్రీట్ గా మారనున్నాయి. ఈ సోషియో ఫాంటసీ- సైన్స్ ఫిక్షన్ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
బిజీ జీవితంలో కుటుంబ బంధాలు అనుబంధాలు పునరుద్ధరించడానికి హిందూ ధర్మంలో పండగల్ని కూడా ఏర్పాటు చేసారు. ఈ పండగలకు ఇంటిల్లిపాదీ ఇలా ఒకే చోట కలుసుకుని సంబరాలు జరుపుకోవడం భారతదేశంలోని ప్రజల ప్రత్యేకత. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేది కూడా ఇలాంటి పండుగలే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
