Begin typing your search above and press return to search.

బన్నీ లైనప్: ఒకరు కోలీవుడ్.. మరొకరు మాలీవుడ్..

ఆ డైరెక్టర్లు ఎవరంటే కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్, మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్.

By:  M Prashanth   |   19 Dec 2025 3:37 PM IST
బన్నీ లైనప్: ఒకరు కోలీవుడ్.. మరొకరు మాలీవుడ్..
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వెకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్యామిలీతో అమెరికా వెళ్లిన బన్నీ.. అక్కడ సెలబ్రేషన్స్ అయ్యాక జనవరి ఫస్ట్ వీక్ లో ఇండియా రానున్నారు. ఆ తర్వాత మళ్లీ బ్యాక్ టు సెట్స్.. అదేనండీ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు.

భారీ బడ్జెట్‌ తో, హై టెక్నాలజీతో ప్రముఖ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై కళానిధి మారన్ రూపొందిస్తున్న ఆ మూవీ షూటింగ్.. ఇప్పటికే ప్రారంభమైంది. పలు షెడ్యూళ్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధం లేని షెడ్యూల్ జరుగుతుందని.. మళ్లీ ఆయన ఎంట్రీ ఇచ్చాక ఆయనకు చెందిన సీన్స్ షూట్ చేస్తారట.

2027లో రిలీజ్ కానున్న ఆ మూవీ షూటింగ్.. నవంబర్ 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తన అప్ కమింగ్ మూవీస్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అటు అట్లీతో చేస్తున్న మూవీని పూర్తి చేస్తూనే.. ఇటు డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందులో కొన్ని చివరి దశలో ఉన్నాయట.

రీసెంట్ గా సౌత్ కు చెందిన ఇద్దరు దర్శకులతో సానుకూల చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్లు ఎవరంటే కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్, మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్. రీసెంట్ గా లోకేష్.. తన వద్ద స్క్రిప్ట్ ను అల్లు అర్జున్ ను నెరేట్ చేశారని ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మొత్తం విన్న అల్లు అర్జున్.. కథ బాగుందని లోకేష్ తో అన్నారట. గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఫిబ్రవరిలో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్.. ఆ సినిమాను నిర్మించనుందని వినికిడి. మరోవైపు, బాసిల్ జోసెఫ్ కూడా ఇటీవల అల్లు అర్జున్ తో చర్చలు జరిపారని, కథను వినిపించారని వార్తలు వస్తున్నాయి.

లోకేష్ తో పాటు జోసెఫ్ చెప్పిన కథకు కూడా బన్నీ అట్రాక్ట్ అయ్యారట. ఆయనకు పచ్చజెండా ఊపితే.. త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని వినికిడి. అయితే బాసిల్ జోసెఫ్ తో అల్లు అర్జున్ మూవీ ఫిక్స్ అయితే.. బన్నీ సొంత బ్యానర్ ప్రముఖ గీతా ఆర్ట్స్ గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించనుందని సమాచారం.

మొత్తానికి అల్లు అర్జున్ తో ఓ కోలీవుడ్ డైరెక్టర్.. మరో మాలీవుడ్ దర్శకుడు జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయని ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే వారిద్దరితో పాటు సంజయ్ లీలా భన్సాలీ, కొరటాల శివ సహా పలువురు దర్శకులతో బన్నీ చర్చలు జరుపుతున్నారని, అవి ఇంకా ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నాయని వినికిడి.