Begin typing your search above and press return to search.

ప్రెజర్‌ను భయంగా కాదు.. ప్రివిలేజ్‌గా చూస్తున్న స్టార్!

ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రేక్షకుల అంచనాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Sept 2026 4:00 PM IST
ప్రెజర్‌ను భయంగా కాదు.. ప్రివిలేజ్‌గా చూస్తున్న స్టార్!
X

ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే చాలు.. కథ ఎలా ఉన్నా థియేటర్లకు వెళ్లే ఆడియ‌న్స్ ఉండేవారు. హీరో ఇమేజ్, సాంగ్స్, యాక్షన్ సీన్స్, భారీ ఓపెనింగ్స్ సినిమాను కొంతవరకు నిలబెట్టేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు గణనీయంగా మారిపోయాయి. సినిమా రిలీజైన కొన్ని గంటల్లోనే ఆడియ‌న్స్ రెస్పాన్స్ సోషల్ మీడియాలోకి వచ్చేస్తోంది. ఓటీటీ, ఇంట‌ర్నేష‌నల్ సినిమాలు, వివిధ భాషల కంటెంట్ అందుబాటులోకి రావడంతో ఆడియన్స్ సెలెక్ష‌న్ పరిధి కూడా భారీగా పెరిగింది. ఈ మార్పునే అల్లు అర్జున్ తన తాజా కామెంట్స్ లో మరోసారి ప్రస్తావించారు.

ప్రస్తుతం ఆడియ‌న్స్ ను థియేటర్లకు రప్పించాలంటే రెగ్యుల‌ర్ కంటెంట్ సరిపోదనే అభిప్రాయం బలపడుతోంది. కథలో కొత్తదనం, మేకింగ్‌లో గ్రాండియర్, పాత్రల్లో బలమైన ఎమోషన్.. ఇలా ఏదో ఒక అంశంలో సినిమా ప్రత్యేకతను చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యావరేజ్ అనే ట్యాగ్ వచ్చిన సినిమాలకు ఎక్కువ కాలం థియేటర్లలో నిలబడే అవకాశం కూడా తగ్గుతోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రేక్షకుల అంచనాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.

ఇదే సమయంలో స్టార్‌డమ్‌తో వచ్చే ఒత్తిడిని అల్లు అర్జున్ భిన్నంగా చూస్తున్నారు. కోట్లాది మంది ఆడియ‌న్స్ అంచనాలను మోయడం ఒక భారంగా కాకుండా, అందరికీ దక్కని అవకాశంగా భావించడం ఆయన మైండ్‌సెట్‌ను తెలియజేస్తోంది. అంటే తనపై పెరిగిన అంచనాలను తగ్గించుకోవడం కంటే.. వాటికి తగ్గ స్థాయిలో సినిమా ఇవ్వాలనే బాధ్యతను స్వీకరించడం ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. బాక్సాఫీస్ లెక్కలను ముందుగా పెట్టుకుని సినిమా చేయడం కంటే.. మంచి సినిమా వస్తే క‌లెక్ష‌న్లు దానంత‌టవే వ‌స్తాయ‌నే నమ్మకాన్ని అల్లు అర్జున్ వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం పెరుగుతున్న కలెక్షన్ ఫస్ట్ కల్చర్‌కు భిన్నమైన దృక్పథంగా చెప్పొచ్చు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ పెరిగిన తర్వాత ఓపెనింగ్ నంబర్ల కంటే సినిమా ఎంతకాలం ఆడియ‌న్స్ లో నిలుస్తుందనేది కూడా కీలకంగా మారుతోంది.

అయితే బన్నీ ఆలోచన కేవలం త‌ర్వాతి సినిమా హిట్ కావడానికే పరిమితం కాకపోవచ్చు. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాల‌తో వచ్చిన జాతీయ స్థాయి గుర్తింపును మరో మెట్టుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటే, టార్గెట్ కేవలం మరో భారీ కలెక్షన్ సాధించడం కంటే పెద్దదిగా మారుతుంది. రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకోవడం కంటే.. భారతీయ సినిమాను మరింత విస్తృతమైన ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లే స్థాయి సినిమా చేయడమే అసలు టార్గెట్ గా కనిపిస్తోంది. అందుకే అల్లు అర్జున్ కామెంట్స్ ను కేవలం ఒక స్టార్ హీరో స్టేట్‌మెంట్‌గా కాకుండా.. ఇప్పటి ఆడియ‌న్స్ పల్స్, పెరుగుతున్న అంచనాలు, స్టార్ హీరోలపై ఉన్న బాధ్యత, కంటెంట్‌కు పెరిగిన ప్రాధాన్యం ప్రతిబింబించే కామెంట్స్ గా చూడొచ్చు.