Begin typing your search above and press return to search.

చ‌దువులో ఫెయిల్యూర్ నుంచి ఐకాన్ స్టార్ వ‌ర‌కు..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తాజాగా ఆయన తమ్ముడు, హీరో అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ ఆసక్తికర చర్చకు దారితీశాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   27 April 2026 2:11 PM IST
చ‌దువులో ఫెయిల్యూర్ నుంచి ఐకాన్ స్టార్ వ‌ర‌కు..
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తాజాగా ఆయన తమ్ముడు, హీరో అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ ఆసక్తికర చర్చకు దారితీశాయి. చిన్నప్పటి బన్నీ వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ శిరీష్ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నప్పుడు బన్నీ చాలా సైలెంట్. క్వైట్, డల్ అని, అస‌లు అల్లరి చేసే టైప్ కాద‌ని, గంటల తరబడి చదివేవాడు కానీ ఎగ్జామ్ టైమ్‌కి వచ్చేసరికి ఏమి గుర్తుండేది కాద‌ని, రివిజ‌న్ టైమ్ లో అమ్మ ప్రశ్నలు అడిగితే బ్లాంక్ అయిపోయేవాడ‌ని, అంత చదివినా చివ‌రికి ఫెయిల్ అయ్యేవాడ‌ని శిరీష్ చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో గతంలో చదువులో ఎంతో కష్టపడినా ఫలితం రాకపోవడం విశేషం.

ఐకాన్ స్టార్ గా నేష‌న‌ల్ లెవెల్ లో గుర్తింపు

ఈ కామెంట్స్ ద్వారా మరోసారి స్పష్టమవుతున్న విషయం ఏమిటంటే, జీవితంలో విజయం సాధించాలంటే చదువులో టాపర్ అవ్వడం ఒక్కటే మార్గం కాదనే నిజం. బన్నీ ఎగ్జాంపుల్ అదే విషయాన్ని బలంగా చెబుతోంది. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో స్టార్‌డమ్‌ను అందుకున్న ఆయన, క్రమంగా పాన్ ఇండియా లెవెల్‌కి ఎదిగి, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమా ఫ్రాంచైజ్ స‌క్సెస్ తో ఆయన మార్కెట్ మరింత విస్తరించగా, నేషనల్ అవార్డ్ సాధించడం ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఒకప్పుడు చదువులో ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తి, ఇప్పుడు కోట్లాది అభిమానులను ప్రభావితం చేసే స్థాయికి చేరుకోవడం అనేది కేవలం టాలెంట్ తో పాటూ పట్టుదల, క్రమశిక్షణ ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది.

భారీ స్థాయిలో తెర‌కెక్కుతున్న రాకా

ఇక ప్రస్తుతం బన్నీ చేస్తున్న ప్రాజెక్ట్ విషయానికి వస్తే, స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో ఆయన కాంబినేషన్‌లో వస్తున్న రాకా అనే సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. భారీ స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా కాదు, గ్లోబల్ లెవెల్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారనే విష‌యం తెలిసిందే. తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ డ్రామాను మిక్స్ చేసే స్టైల్‌కు పేరుగాంచిన డైరెక్ట‌ర్ అట్లీ. అలాంటి డైరెక్టర్‌తో బన్నీ జోడీ కట్టడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. కథ, కాన్సెప్ట్ విషయాల్లో కొత్తదనం ఉండబోతుందని, బన్నీని ఇప్పటివరకు చూడని లుక్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్త‌మ్మీద, చిన్నప్పుడు చదువులో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న ఒక అబ్బాయి, తన టాలెంట్‌ను గుర్తించి దానిపైనే ఫోకస్ పెట్టి దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్‌గా ఎదిగిన తీరు ఇప్పుడు యూత్‌కు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ను ఇస్తోంది. సక్సెస్‌కు ఒకే ఒక ఫార్ములా ఉండదని, ప్రతి ఒక్కరి ప్రయాణం వేర్వేరుగా ఉంటుందని అల్లు అర్జున్ కథ మరోసారి నిరూపిస్తోంది. ఇక అట్లీతో చేస్తున్న ఈ కొత్త సినిమా ఆయన కెరీర్‌ను మ‌రో మెట్టు ఎక్కిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.