Begin typing your search above and press return to search.

రాకా: బన్నీ ప్లానే వేరు.. అప్పుడే ట్రెండ్ సెట్టర్ గా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన లుక్‌ తోనే సంచలనం సృష్టిస్తున్నారు. పుష్ప 2 వంటి భారీ విజయానంతరం ఆయన నుంచి వస్తున్న కొత్త ప్రాజెక్ట్ రాకా ఇప్పటికే హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   18 April 2026 9:59 AM IST
రాకా: బన్నీ ప్లానే వేరు.. అప్పుడే ట్రెండ్ సెట్టర్ గా..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన లుక్‌ తోనే సంచలనం సృష్టిస్తున్నారు. పుష్ప 2 వంటి భారీ విజయానంతరం ఆయన నుంచి వస్తున్న కొత్త ప్రాజెక్ట్ రాకా ఇప్పటికే హాట్ టాపిక్‌ గా మారింది. టైటిల్ పోస్టర్ విడుదలతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. రాకా ఫస్ట్ లుక్‌ ను సాధారణంగా విడుదల చేయకుండా, ప్రత్యేకంగా ప్లాన్ చేయడం విశేషం.

పోస్టర్‌ లో డార్క్ అండ్ ఇంటెన్స్ కలర్ టోన్‌తో మేకర్స్ కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేశారు. హీరో లుక్‌ ను పూర్తిగా రివీల్ చేయకపోయినా, బ్యాక్‌ డ్రాప్‌ లో కనిపించే ఎలిమెంట్స్.. సినిమా భారీ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని క్లారిటీ ఇస్తున్నాయి. రాకా అనే టైటిల్ కూడా మాస్ ఫీల్‌ ను కలిగిస్తూ, సినిమాలో ఉన్న రగ్డ్ ఎమోషన్‌ ను హైలైట్ చేస్తోంది.

ఇక ప్రాజెక్ట్‌ లో అత్యంత చర్చనీయాంశంగా మారింది అల్లు అర్జున్ లుక్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. సినిమాలో ఆయన సగం మనిషి – సగం తోడేలు తరహా గెటప్‌ లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది కేవలం మేకోవర్ మాత్రమే కాకుండా, కథలో కీలకమైన అంశంగా ఉండబోతుందని టాక్. ఆ కాన్సెప్ట్ ద్వారా దర్శకుడు అట్లీ కుమార్ మరోసారి కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఆ లుక్ కోసం అల్లు అర్జున్ పడుతున్న కష్టం కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. రోజూ 3 నుంచి 4 గంటల పాటు మేకప్, స్టైలింగ్, డిటైలింగ్ కోసం సమయం కేటాయిస్తున్నారని సమాచారం. ఒక భారీ హిట్ తర్వాత సాధారణంగా నటులు కంఫర్ట్ జోన్‌ లోకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ మాత్రం తనను తాను కొత్తగా మలుచుకునే ప్రయత్నం చేస్తుండటం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇదే కారణంగా రాకాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతున్నాయి. ప్రతి సినిమాతో కొత్తగా కనిపించాలనే ఆయన ప్రయత్నం క్లియర్ గా కనిపిస్తోంది. ఇప్పటికే బన్నీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య.. సినిమాలోని సిగ్నేచర్ హ్యాండ్ జెష్చర్‌ ను రీక్రియేట్ చేయడం మరింత హైలైట్‌ గా మారింది. దీంతో ఫ్యాన్స్‌లో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.

ఇక నిర్మాణ పరంగా కూడా రాకా భారీ ప్రాజెక్ట్‌ గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్న ఆ సినిమా, భారతీయ సినీ చరిత్రలో అత్యంత కాస్ట్లీ చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.. మొత్తానికి, టైటిల్ పోస్టర్‌ తోనే భారీ బజ్ సృష్టించిన రాకా, విడుదలకు ముందే ట్రెండ్ సెట్టర్‌ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బన్నీ కొత్త లుక్, అట్లీ డైరెక్షన్, భారీ బడ్జెట్ అన్నీ కలిసి సినిమాను మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ గా మార్చుతున్నాయి.