Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్‌కు పెరుగుతున్న క్రేజ్.. రోజుకు ఏకంగా 7 కోట్లు!

‘పుష్ప’తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్‌కు బ్రాండ్ ఆఫర్ల డిమాండ్ పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. యాడ్ షూటింగ్‌కు రోజుకు రూ.7 కోట్లకు పైగా తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఏషియన్ పెయింట్స్, లోరియల్ బ్రాండ్లతోనూ ఒప్పందాలు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By:  Madhu Reddy   |   16 Nov 2026 1:28 PM IST
ఐకాన్ స్టార్‌కు పెరుగుతున్న క్రేజ్.. రోజుకు ఏకంగా 7 కోట్లు!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ క్రేజ్, ఇప్పుడు దేశాలు దాటి విదేశాలకు కూడా పాకింది. ఆయన డైలాగ్స్, యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అవ్వడంతో బన్నీ మార్కెట్ వ్యాల్యూ ఊహించని స్థాయికి వెళ్లింది. దీంతో ఇప్పుడు బడా బడా కంపెనీలన్నీ తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయమని అల్లు అర్జున్ ఇంటి ముందు క్యూ కడుతున్నాయి.ఆ వివరాలు చూద్దాం..

‘రాకా’ సినిమాతో డబుల్ అయిన హైప్:

‘పుష్ప’ సినిమాల తర్వాత అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ‘రాకా’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, బన్నీ కొత్త లుక్ బయటకు రావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా మేనియా కూడా తోడవడంతో, బన్నీతో యాడ్స్ చేయడానికి కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి.

రోజుకు రూ. 7 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్!:

బన్నీ తమ యాడ్‌లో కనిపిస్తే చాలు, తమ బిజినెస్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుందని కంపెనీలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే ఎంత ఖర్చయినా పెట్టడానికి వెనుకాడట్లేదు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఒక యాడ్ షూటింగ్ కోసం అల్లు అర్జున్ రోజుకు కనీసం రూ. 7 కోట్లకు పైగానే తీసుకుంటున్నాదాని టాక్. ఇక ఈ రేంజ్ రెమ్యూనరేషన్ కొందరు బాలీవుడ్ స్టార్ హీరోల కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.

కొత్తగా ఏషియన్ పెయింట్స్, లోరియల్ బ్రాండ్లు? :

ఇప్పటికే కోకా కోలా, జొమాటో, రెడ్ బస్, ర్యాపిడో, సెవెన్ అప్, ఆస్ట్రల్, శ్రీ చైతన్య లాంటి ఎన్నో పెద్ద బ్రాండ్లకు బన్నీ అంబాసిడర్‌గా ఉన్నాడు. అయితే, తాజాగా ప్రముఖ పెయింట్స్ సంస్థ ‘ఏషియన్ పెయింట్స్’, ఇంటర్నేషనల్ కాస్మెటిక్స్ బ్రాండ్ ‘లోరియల్’ తో కూడా అల్లు అర్జున్ చేతులు కలిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు, కొత్త యాడ్స్ రాబోతున్నాయని టాక్ నడుస్తోంది.

ఇక ఒకప్పుడు కేవలం తెలుగు, మలయాళం సినిమాలకే పరిమితమైన బన్నీ క్రేజ్, ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అటు ‘రాకా’ సినిమాతో, ఇటు ఈ భారీ బ్రాండ్ డీల్స్‌తో అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గరే కాదు, యాడ్ ప్రపంచంలోనూ తన హవా చూపిస్తున్నాడు.