పుష్పని మించిన ఊర మాస్ సినిమా లోడింగ్..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు ఇండియన్ బాక్సాఫీస్ పై పుష్ప 1 అండ్ 2 సినిమాలు చేసిన హంగామా నెక్స్ట్ లెవెల్ అనిపించాయి
By: Ramesh Boddu | 16 Nov 2025 6:00 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు ఇండియన్ బాక్సాఫీస్ పై పుష్ప 1 అండ్ 2 సినిమాలు చేసిన హంగామా నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ విశ్వరూపం ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందించింది. నేషనల్ లెవెల్ ఆడియన్స్ సైతం అల్లు అర్జున్ నటనకు పూనకాలతో ఊగిపోయారు. అందుకే పుష్ప రికార్డులను తిరగరాసింది. ఐతే పుష్ప తర్వాత అట్లీతో అల్లు అర్జున్ సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ సినిమాను ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.
మాస్ హిట్ అందించిన డైరెక్టర్ తో అల్లు అర్జున్..
ఐతే అట్లీ సినిమా 2027 రిలీజ్ ప్లానింగ్ లో ఉండగా ఆ సినిమా తర్వాత మరోసారి ఒక మాస్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్. అది కూడా తనకు ఒకసారి మాస్ హిట్ అందించిన డైరెక్టర్ తోనే కలిసి పనిచేయబోతున్నాడని టాక్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటే బోయపాటి శ్రీను అని తెలుస్తుంది. బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సరైనోడు సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో అల్లు అర్జున్ లోని ఊర మాస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ కి మరింత జోష్ అందించింది.
ఐతే అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరోసారి బోయపాటి శ్రీను తో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నారట. ఆల్రెడీ ఈ ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయట. ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండ 2 రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. బాలయ్య అఖండ 2 తాండవంతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను ఈసారి నేషనల్ లెవెల్ ఆడియన్స్ కి తన మాస్ డైరెక్షన్ రేంజ్ చూపించబోతున్నారు.
పుష్ప తో నేషనల్ లెవెల్ ఫాలోయింగ్..
అఖండ 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా కథ రెడీ చేసే పనుల్లో బిజీ అవుతారని తెలుస్తుంది. మరోసారి సరైనోడు కాంబో అంటే ఆడియన్స్ లో సూపర్ ఎగ్జైట్మెంట్ మొదలైంది. ఐతే అల్లు అర్జున్ బోయపాటి సినిమా కూడా తప్పకుండా పాన్ ఇండియా రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తారని చెప్పొచ్చు. పుష్ప తో నేషనల్ లెవెల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ రాబోయే సినిమాలన్నీ కూడా అదే రేంజ్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. సో అట్లీ తర్వాత బోయపాటి సినిమా సెట్ అయితే అది కూడా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుంది.
అట్లీ సినిమా మరో రెండేళ్లు టైం ఉంది ఐతే అప్పటిదాకా బోయపాటి అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తాడా లేదా మరో సినిమా ఏదైనా చేస్తాడా అన్న చర్చ కూడా నడుస్తుంది. ఐతే బన్నీ సినిమా ముందు మరో సినిమా చేసినా సరే అల్లు అర్జున్ ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా బోయపాటితో సినిమా చేయాలని ఫిక్స్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఐతే అఫీషియల్ గా ఈ కాంబో సినిమా అప్డేట్ వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.
