బన్నీతో బోయపాటి..'అఖండ 2' కీలకమే!
బన్నీ-బోయపాటి కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి కలకయికలో `సరైనోడు` అనే మాస్ హిట్ ఒకటి పడింది.
By: Srikanth Kontham | 7 Nov 2025 7:00 PM ISTబన్నీ-బోయపాటి కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి కలకయికలో `సరైనోడు` అనే మాస్ హిట్ ఒకటి పడింది. బన్నీని 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టిన రెండవ చిత్రమది. అయితే ఆ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా పడలేదు. కానీ మరో సినిమాకు ఒప్పందం జరిగింది. ఈ విషయం అధికారికంగా కూడా అల్లు అరవింద్ ప్రకటించారు. `పుష్ప` మొదటి భాగం రిలీజ్ సమయంలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే `పుష్ప` రిలీజ్ అనంతర బన్నీ పాన్ ఇండియాలో స్టార్ అయ్యాడు. `పుష్ప 2` విజయంతో ఆ స్థానం సుస్థిరమైంది.
బోయపాటి వైపు బన్నీ చూపు:
స్టైలిష్ స్టార్ గా ఉన్ బన్నీ నేడు ఐకాన్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం అట్లీతో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ల్లో ఇదొకటి. అంతర్జాతీయంగా ఈసినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే బన్నీ గ్లోబల్ స్టార్ అవుతాడు. అట్లీపై ఉన్న నమ్మకం అలాంటింది. మరి ఇలాంటి సమయంలో బన్నీ మళ్లీ బోయపాటి వైపు చూసే పరిస్థితి ఉంటుందా? అంటే ఇది బోయపాటి కి పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఇంత వరకూ బోయపాటికి పాన్ ఇండియా హిట్ లేదు. ఆయన కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు.
బోయపాటిపై వాళ్ల నమ్మకం:
అయితే `అఖండ` తో మాత్రం పాన్ ఇండియాలో బోయపాటికి ఓ గుర్తింపు దక్కింది. హిందీ ఆడియన్స్ ఆ సినిమా ఓటీటీ, డబ్బింగ్ రూపంలో బాగా రీచ్ అయింది. ప్రస్తుతం అదే బాలయ్య తో `అఖండ 2` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఓ పాత్రలో బాలయ్య అఘోరగా కనిపించ నున్నారు. ఈ రోల్ నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లక్కీగా ఇదే ఏడాది కుంభమేళ కూడా జరగడంతో? అక్కడా చాలా సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ రకంగా పాన్ ఇండియాలో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది.
బోయపాటికి ఛాన్స్ అప్పుడే:
డిసెంబర్ లో `అఖండ 2` రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియాకి గనుక రెండవ భాగం కనెక్ట్ అయితే తిరుగుండదు. బోయపాటి బన్నీ దగ్గరకు వెళ్లడం కాదు. ఆయనే బోయపాటి దగ్గరకు దిగొస్తాడు. స్టార్ హీరోలు ఎంత యూనిక్ సినిమాలు చేసినా? అప్పుడప్పుడు రీజనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మాస్ కంటెంట్ తో కూడా ఓ సినిమా చేయాలి అన్న ఆలోచన ప్రతీ స్టార్ కు ఉంటుంది. ఆ రకంగా బన్నీ మరోసారి ఛాన్స్ తీసుకునే అవకాశం లేకపోలేకపోలేదు. అయితే ఇదంతా జరగాలి? అంటే అఖండ 2 పెద్ద హిట్ అవ్వాలి. అప్పుడే సాధ్యమవుతంది. లేదంటే? ఎంత మాత్రం ఛాన్స్ ఉండదు. ఇప్పటికే బన్నీ పై సౌత్ సహా బాలీవుడ్ డైరెక్టర్లు కూడా కన్నేసిన సంగతి తెలిసిందే.
