Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ టాలీవుడ్ రాత మార్చేలా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలియ‌దు. కానీ ఎంట్రీ ఇస్తే గ‌నుక టాలీ వుడ్ రాత మార్చేలా ఉండాలి.

By:  Srikanth Kontham   |   28 Aug 2025 2:00 PM IST
ఐకాన్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ టాలీవుడ్ రాత మార్చేలా!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలియ‌దు. కానీ ఎంట్రీ ఇస్తే గ‌నుక టాలీ వుడ్ రాత మార్చేలా ఉండాలి. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో లాంచ్ ఏ హీరో కూడా స‌క్సెస్ అవ్వ‌లేదు. సీనియ‌ర్ హీరోల నుంచి త‌ర్వాత త‌రం హీరోల వ‌ర‌కూ ఏ న‌టుడికి స‌రైన లాం చింగ్ చిత్రం ప‌డ‌లేదు. సీనియ‌ర్ల‌లో చిరంజీవి, నాగార్జు, వెంకటేష్‌, జూనియ‌ర్ల‌లో రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్, ఎన్టీఆర్ వీళ్లంతా బాలీవుడ్ లో ఇప్ప‌టికే లాంచ్ అయిన స్టార్లు. కానీ ఎవ‌రికీ అక్క‌డ గ్రాండ్ లాంచింగ్ ద‌క్క‌లేదు.

హిందీ రికార్డులే చెరిపేసిన స్టార్:

సీనియ‌ర్ స్టార్ల‌ను మిన‌హాయిస్తే త‌ర్వాత జ‌న‌రేష‌న్ హీరోలైనా గ్రాండ్ విక్ట‌రీలు న‌మోదు చేయాలి. కానీ ఇంత వ‌ర‌కూ ఆ ఛాన్సే లేకుండా పోయింది. 'వార్ 2' తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అయినా షేక్ చేస్తాడ‌నుకుంటే అత‌డు తేలిపోయాడు. రానున్న రోజుల్లో మ‌రింత మంది స్టార్లు అక్క‌డ లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంది. కానీ అంద‌రికంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పైనే అంద‌రి న‌మ్మ‌కాలు బ‌లంగా ఉన్నాయి. `పుష్ప‌2` తో బాలీవుడ్ హీరోల రికార్డులే ఓ తెలుగు సినిమాతో తిర‌గ‌రాసాడు బన్నీ. అర్జున్ స‌హా టాలీవుడ్ ఏమాత్రం ఊహించ‌ని స‌న్నివేశం ఇది.

బ‌న్నీతోనే సాద్య‌మా?

1800 కోట్ల వ‌సూళ్ల‌తో వ‌ర‌ల్డ్ వైడ్ `బాహుబ‌లి` రికార్డుల‌ను సైతం తిర‌గ‌రాసిన చ‌రిత్ర బ‌న్నీకి సాధ్య‌మైంది. అదే 'పుష్ప' ది రైజ్ చిత్రంతో జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ ఎంపికయ్యాడు. 100 ఏళ్ల తెలుగు సినీ చ‌రిత్ర లో ఏ న‌టుడికి ద‌క్క‌ని అరుదైన గౌరవం, గుర్తింపు బ‌న్నీకి సాధ్య‌మ‌య్యాయి. ఇలా బ‌న్నీ పేరిట బాలీవుడ్ లో న‌మోదైన రికార్డుల ఫ‌లితంగా ఉత్త‌రాదిన‌ స్ట్రెయిట్ సినిమా తీస్తే బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యేది అది బ‌న్నీ ఇమే జ్తోనే? సాధ్య‌వ‌మ‌తుందని ప‌రిశ్ర‌మ‌లో కొత్త‌గా చ‌ర్చ మొద‌లైంది. మ‌రి బ‌న్నీ బాలీవుడ్ లో ఎప్పుడు లాంచ్ అవుతాడో ? చూడాలి.

భారీ అంచ‌నాల మ‌ధ్య‌:

ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ 22వ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఎస్ ఎస్ ఎంబీ 29 త‌ర్వాత ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కుతోంది. మ‌హేష్ సినిమాకే బ‌న్నీ పోటీగా క‌ని పిస్తున్నాడు. బ‌న్నీ హీరో కావ‌డం..ఆ క‌థ‌ను అట్లీ డీల్ చేయడంతోనే ఈ రేంజ్ లో బ‌జ్ క్రియేట్ అవు తుంది. అత్యంత భారీ బ‌డ్జెట్ తో స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణంలోకి దిగ‌డం బ‌న్నీసినిమాకు మ‌రో ఎత్తులా మారింది.