Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ స‌క్సెస్‌ ను బాలీవుడ్ జీర్ణించుకోవ‌డం లేదా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న టాప్ హీరోల్లో ఒకరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

By:  M Prashanth   |   11 Feb 2026 3:58 PM IST
ఐకాన్ స్టార్ స‌క్సెస్‌ ను బాలీవుడ్ జీర్ణించుకోవ‌డం లేదా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న టాప్ హీరోల్లో ఒకరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. పుష్ప సిరీస్‌ చిత్రాలతో నేషనల్ వైడ్ గా ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. ముఖ్యంగా హిందీ మార్కెట్‌ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పుష్ప 2 విజయంతో ఆయన రేంజ్ మరింత పెరిగింది.

అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ పై నెగెటివ్ ప్రచారం జరుగుతోందన్న చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది. బాలీవుడ్ వర్గాలు కావాలనే బన్నీ ఇమేజ్‌ ను దెబ్బతీయాలని చూస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఫేక్ రూమర్స్, కలెక్షన్లపై అనుమానాలు, పర్సనల్ కామెంట్స్.. ఇలా సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెరుగుతున్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు.

దీంతో ఐకాన్ స్టార్ సక్సెస్‌ ను బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ప్రభాస్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించిందని ఆయన ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్‌ గా ఎదిగిన తర్వాత డార్లింగ్ పై కూడా నెగిటివ్ ప్రచారం జరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా రీసెంట్ గా ది రాజా సాబ్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో అనవసరమైన ట్రోలింగ్ జరిగిందని అభిమానులు అంటున్నారు.

ఇప్పుడు అదే తరహాలో అల్లు అర్జున్ టార్గెట్ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే పుష్ప 2 విజయంతో బాలీవుడ్ హీరోలకు సమానంగా బన్నీ మార్కెట్ పెరగడం కొందరు జీర్ణించుకోవడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. నార్త్‌ లో తెలుగు హీరో సినిమాకు ఇంతటి కలెక్షన్లు రావడం అక్కడ ఆశ్చర్యానికి గురి చేసిందని అభిమానులు చెబుతున్నారు. దీంతో కావాలనే నెగిటివ్ స్టోరీలు క్రియేట్ చేస్తున్నారన్న అనుమానిస్తున్నారు.

అయితే ఆ ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందనేది చెప్పలేం. స్టార్‌ డమ్ పెరిగేకొద్దీ విమర్శలు రావడం సహజమేనని కొందరు సినీ ప్రియులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా జనరేషన్ లో ఫేక్ న్యూస్, ట్రోల్స్ స్పీడ్ గా వైరల్ అవుతుంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని తప్పుగా చూడటం కూడా సరైనది కాదని అంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ మాత్రం తన పనిపై ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నారు.

సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ పాన్ ఇండియా మార్కెట్‌ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడియన్స్ సపోర్ట్ ఉన్నంత కాలం ఎలాంటి నెగిటివిటీ ఆయన ఇమేజ్‌ ను దెబ్బతీయలేదని అభిమానులు చెబుతున్నారు. మొత్తానికి, అల్లు అర్జున్‌ పై జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్ లో నిజంగా బాలీవుడ్ యాంగిల్ ఉందా? లేక సోషల్ మీడియా హడావుడా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం.. ఐకాన్ స్టార్ క్రేజ్ మాత్రం అలాగే కొనసాగుతోంది.