బన్నీ 'ఫిల్మ్ ఫేర్'.. ఎంత పెద్ద హీరో అయినా..
ఫిల్మ్ ఫేర్ సొంతం చేసుకోవడంతో బన్నీ మరో అరుదైన రికార్డు కూడా సాధించారు. టాలీవుడ్ లో అత్యధిక ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న హీరోల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నిలిచారు.
By: M Prashanth | 22 Feb 2026 1:21 PM ISTకొచ్చి వేదికగా జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకుని మరోసారి తన స్టార్ డమ్ చాటుకున్నారు. బ్లాక్ కలర్ స్టైలిష్ సూట్ లో స్టేజ్ పైకి వచ్చిన బన్నీ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అవార్డు తీసుకునే ముందు వేదికకు నమస్కరించి గౌరవం తెలపడం ఆయన వినయాన్ని చూపించింది.
అందుకు సంబంధించిన విజువల్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానులను మరింత ఆకట్టుకున్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల వేడుక ఈసారి కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. సినీ తారలు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పెద్ద ఎత్తున హాజరై వేడుకను సక్సెస్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమల ప్రముఖులు ఒకేచోట చేరడంతో ఈవెంట్ కు గ్రాండ్ లుక్ వచ్చింది.
ఈ ఏడాది తెలుగు సినిమాల హవా క్లియర్ గా కనిపించింది. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పుష్ప 2: ది రూల్ సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. సినిమాలో ఆయన చూపిన మాస్ యాటిట్యూడ్, యాక్షన్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ అవార్డు ఆయనకు దక్కిందనే చెప్పాలి.
ఫిల్మ్ ఫేర్ సొంతం చేసుకోవడంతో బన్నీ మరో అరుదైన రికార్డు కూడా సాధించారు. టాలీవుడ్ లో అత్యధిక ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న హీరోల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నిలిచారు. ఇద్దరూ ఇప్పటివరకు ఏడు అవార్డులు అందుకుని అగ్రస్థానంలో ఉన్నారు. ఇది అల్లు అర్జున్ కెరీర్ లో ఒక పెద్ద మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు.
అయితే అవార్డు వేడుకలో అల్లు అర్జున్ స్టైల్, సింప్లిసిటీ, వినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టేజ్ పైకి వెళ్లే ముందు దండం పెట్టడం ద్వారా ఆర్టిస్ట్ ల పట్ల, వేదిక పట్ల గౌరవం చూపించారు. ఇదే నిజమైన స్టార్ డమ్, బన్నీ వినయం సూపర్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలో బన్నీ లుక్, సందడి, వినయం హైలైట్ గా నిలిచాయి.
ఇక అల్లు అర్జున్ కెరీర్ విషయానికొస్తే.. పుష్ప-2 మూవీ తర్వాత ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ భారీ ప్రాజెక్టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తన బ్రదర్ అల్లు శిరీష్ మ్యారేజ్ మరికొద్ది రోజుల్లో జరగనుండగా.. బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన శిరీష్- నయనిక ప్రీ వెడ్డింగ్ పార్టీలో సందడి చేసిన బన్నీ.. ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.
