Begin typing your search above and press return to search.

జాత‌రే జాత‌ర‌.. 2027లో ఐకాన్‌స్టార్ ఫోక‌స్ వీటిపైనే!

‘పుష్ప’ తర్వాత సినిమాల వేగం పెంచాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2027-29 మధ్య వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నారట. అట్లీతో ‘రాకా’ పూర్తి చేసిన తర్వాత లోకేష్ కనగరాజ్‌తో AA23, త్రివిక్రమ్‌తో AA24, బాసిల్ జోసెఫ్‌తో AA25 చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

By:  Sivaji Kontham   |   27 Nov 2026 7:58 AM IST
జాత‌రే జాత‌ర‌.. 2027లో ఐకాన్‌స్టార్ ఫోక‌స్ వీటిపైనే!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సంవత్సరంలో అడుగుపెడుతూనే తన సినీ ప్రణాళికల్లో దూకుడు పెంచబోతున్నారు. ఒక్కో సినిమా కోసం ఏళ్ల తరబడి సమయం వెచ్చించే పాత పద్ధతికి స్వస్తి చెప్పి..2027-29 పీరియ‌డ్ లో వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా బన్నీ ప్ర‌తిదీ ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈసారి ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్న అల్లు అర్జున్.. నూతన సంవత్సర వేడుకలను విదేశాల‌లో జ‌రుపుకుని ఆ వెంటనే క్యూలో ఉన్న తన దర్శకులకు అందుబాటులోకి రానున్నట్లు సినీ వర్గాల సమాచారం. అట్లీతో రాకా పెండింగ్ షూట్ ను పూర్తి చేసిన త‌ర్వాత ఇత‌రుల‌తో ప‌నిని నిరాఠంకంగా ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది.

అభిమానులకు విరామం లేకుండా వినోదాన్ని అందించేందుకు పరిమిత సమయంలో.. వేగంగా సినిమాలు పూర్తి చేసే దర్శకులకు అల్లు అర్జున్ వెంటనే ఓకే చెప్ప‌నున్నార‌ని కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన తన లైనప్‌లోని దర్శకులను ఎప్పటికప్పుడు అటూ ఇటూ మారుస్తూ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బన్నీ తదుపరి చిత్రం (AA23) కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనుండగా.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో `AA24` పట్టాలెక్కనుంది.

మరోవైపు అల్లు అర్జున్ కెరీర్‌లో మైలురాయిగా నిలవనున్న 25వ చిత్రం (AA25) మలయాళ ప్రతిభావంతుడైన దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఉండబోతోందని బలంగా వినిపిస్తోంది. ఇటీవల గోవాలో జరిగిన `ఇఫీ- 2026` వేడుకలో స్వయంగా బాసిల్ జోసెఫ్ తన తదుపరి చిత్రం 2027లో ప్రారంభమవుతుందని ధృవీకరించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. జెట్ స్పీడ్‌తో సినిమాలు తీసే ప్ర‌త్యేక‌ మేకింగ్‌కు పేరున్న లోకేష్, బాసిల్ వంటి దర్శకులను ఎంచుకోవడం వెనుక బన్నీ పక్కా స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది.

మొత్తానికి `పుష్ప` ఫ్రాంచైజీ తర్వాత గ్యాప్ లేకుండా వెంటవెంటనే సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగించాలనే గట్టి పట్టుదలతో అల్లు అర్జున్ పనిచేస్తున్నారు. లోకేష్ కనగరాజ్, త్రివిక్రమ్, బాసిల్ జోసెఫ్ ఒక‌రితో ఒక‌రు సంబంధం లేకుండా భిన్న శైలి ఉన్న ద‌ర్శ‌కులు కావ‌డంతో ప్ర‌తి సినిమా దేనికదే ప్ర‌త్యేక‌మ‌ని కూడా భావించ‌వ‌చ్చు.