బన్నీ- అట్లీ.. రెండేళ్ల తర్వాతేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 4 Sept 2025 11:00 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా రాజీ లేకుండా ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు.
హాలీవుడ్ రేంజ్ లో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంతోపాటు విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్దపీట వేస్తూ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రెడీ అవుతున్న ఆ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర మూడు కోణాల్లో సాగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని తెలుస్తుండగా.. అందులో ఒకరు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే అని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతితోపాటు యోగిబాబు నటిస్తున్నారని సమాచారం. సీనియర్ నటి రమ్యకృష్ణ ఇప్పటికే సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారని వినికిడి.
ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ ను మేకర్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అల్లు అర్జున్ నాన్నమ్మ కన్నుమూయగా.. షూటింగ్ ను రద్దు చేసుకుని ఆయన హైదరాబాద్ విచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ వెళ్లి చిత్రీకరణలో పాల్గొని శభాష్ అనిపించుకున్నారు. అయితే ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
పుష్ప సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అలరించిన బన్నీ.. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో మెప్పించనున్నారని అంతా అంచనా వేస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని అవతార్ లో కనిపించనున్నారని సమాచారం. ఏదేమైనా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
కాగా.. అల్లు అర్జున్- అట్లీ మూవీ 2027లో రిలీజ్ అవుతుందని ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అంటే మొత్తానికి ఇంకా రెండేళ్ల తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట. మరి అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
