AA22 x A6: షూటింగ్ లో బాలీవుడ్ స్టార్.. గట్టిగానే ఇచ్చాడుగా..
ఈ ప్రాజెక్ట్ (AA22 x A6) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ గ్లింప్స్ రాలేదు. కానీ, సెట్స్‌లో ఏం జరుగుతుందో చూసిన ఒక వ్యక్తి, ఇప్పుడు ఆ సినిమా రేంజ్ ఏంటో బయటపెట్టారు.
By: M Prashanth | 20 Oct 2025 9:37 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 'జవాన్' డైరెక్టర్ అట్లీ.. ఈ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలయ్యాయి. బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె కూడా తోడవడంతో, ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, ఇప్పుడు ఆ అంచనాలకు బూస్ట్ పోస్తూ, ఒక బాలీవుడ్ స్టార్ హీరో నుంచి మైండ్‌బ్లోయింగ్ కామెంట్స్ బయటకు వచ్చాయి.
ఈ ప్రాజెక్ట్ (AA22 x A6) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ గ్లింప్స్ రాలేదు. కానీ, సెట్స్‌లో ఏం జరుగుతుందో చూసిన ఒక వ్యక్తి, ఇప్పుడు ఆ సినిమా రేంజ్ ఏంటో బయటపెట్టారు. ఆ మాటలు విన్న తర్వాత, ఈ సినిమాపై ఉన్న హైప్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక సినిమాటిక్ వండర్ అనిపిస్తోంది.
ఆ వ్యక్తి మరెవరో కాదు, బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్. తన భార్య, హీరోయిన్ దీపికా పదుకొణె షూటింగ్ కోసం రీసెంట్‌గా అట్లీ సెట్స్‌కు వెళ్లారట. అక్కడ చూసిన విజువల్స్, అట్లీ మేకింగ్ స్టైల్ చూసి షాక్ అయ్యారట. ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ, "నేను అట్లీ సినిమా సెట్స్‌కు వెళ్లాను. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇండియన్ సినిమాలో మీరు ఇప్పటివరకు చూడని, ఎక్స్‌పీరియన్స్ చేయని ఒక అద్భుతాన్ని ఆయన క్రియేట్ చేస్తున్నాడు. ఇది నా మాటగా తీసుకోండి" అని రణ్‌వీర్ ఒక పవర్ఫుల్ ఎలివేషన్ అయితే ఇచ్చాడు.
ఈ మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇది సినిమా టీమ్ ఇచ్చుకున్న బిల్డప్ కాదు. ఒక బయటి వ్యక్తి, అదీ ఒక టాప్ స్టార్ ఇచ్చిన సర్టిఫికెట్. రణ్‌వీర్ మాటలను బట్టి చూస్తే, అట్లీ ఈసారి విజువల్స్‌తో, కథనంతో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారని, ఇండియన్ సినిమా స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని ఒక ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారని స్పష్టమవుతోంది.
నిజానికి, రణ్‌వీర్ సింగ్ చాలా కాలంగా అట్లీకి పెద్ద ఫ్యాన్. 'జవాన్' కంటే ముందే, 'మెర్సల్' సినిమా చూసి అట్లీకి మెసేజ్ చేశానని, ముంబై వచ్చి కలిసి సినిమాలు చేద్దామని అడిగానని రణ్‌వీర్ గుర్తుచేసుకున్నారు. ఇక రీసెంట్ గా ఒక కమర్షియల్ యాడ్ వార్తతో ఈ కాంబినేషన్ మరింత హైలెట్ అయ్యింది.
ఏదేమైనా ఒక విజనరీ డైరెక్టర్, ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి పవర్ హౌస్‌తో చేతులు కలపడంతో, అవుట్‌పుట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తం మీద, అల్లు అర్జున్ అట్లీ సినిమాపై అంచనాలు ఇప్పటికే హై లెవెల్లో ఉన్నాయి. బడ్జెట్ 700 కొట్లకు పైనే ఉంటుందని అంటున్నారు. ఇక ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ ఇచ్చిన ఈ "ఇన్‌సైడర్" రివ్యూతో, ఆ అంచనాలకు మరింత బూస్ట్ దొరికింది. ఇక ఫస్ట్ అప్డేట్ సమయానికి హడావుడి ఎలా ఉంటుందో చూడాలి.
