Begin typing your search above and press return to search.

బన్నీతో మరో సీనియర్ స్టార్.. పట్టుబట్టి మరీ ఒప్పించిన అట్లీ!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   18 Aug 2025 3:02 PM IST
బన్నీతో మరో సీనియర్ స్టార్.. పట్టుబట్టి మరీ ఒప్పించిన అట్లీ!
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ బన్నీ- అట్లీ మూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది.

సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రెడీ అవుతున్న ఆ సినిమాను అట్లీ ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. అగ్రశ్రేణి తారలు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులను రంగంలోకి దించుతున్నారు. ఫిమేల్ లీడ్ రోల్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే నటిస్తున్నట్లు కొద్ది రోజుల మేకర్స్.. పోస్టర్ తో అనౌన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

దీపికపాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, భాగ్యశ్రీ బోర్సే కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ యాక్ట్ చేస్తున్నట్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒక ముఖ్యమైన పాత్ర కోసం అట్లీ పట్టుబట్టి మరీ ఒప్పించారని టాక్.

బన్నీ తల్లిగా ఆమె కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. తొలిసారి వారిద్దరూ కలిసి వర్క్ చేయనున్నారు. నిజానికి.. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఏ సినిమాలోనూ రమ్యకృష్ణ నటించలేదు. మొదటిసారి ఆ ఫ్రెష్ కాంబో అట్లీ వల్ల సాధ్యమవుతోందని చెప్పాలి. ఒక్క సిట్టింగ్ లోనే అట్లీ నెరేషన్ కు మెచ్చి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి.

ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతుండగా.. అప్డేట్స్ అసలు పెద్దగా బయటకు రావడం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్ పై సీన్స్ ను మేకర్స్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు రమ్యకృష్ణ కూడా సెట్స్ లో జాయిన్ అవ్వనున్నారని సమాచారం. ఆమెపై కీలక సన్నివేశాలు త్వరలో చిత్రీకరించనున్నారని సమాచారం.

అయితే రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉందని చెప్పాలి. కాగా, అల్లు అర్జున్, అట్లీ మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. 75 శాతం షూటింగ్ అయ్యాక డిసైడ్ చేయనున్నారని సమాచారం. షూటింగ్ 2026 ప్రారంభం వరకు కొనసాగుతుందని, ప్రపంచవ్యాప్తంగా అదే ఏడాది చివరిలో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.