Begin typing your search above and press return to search.

శంకర్ తో అవ్వలేదు.. శిష్యుడు తీసుకొస్తాడా?

మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోయినా ఈ రేంజ్ కాస్టింగ్ రూమర్ బయటకు రావడంతో మళ్ళీ బజ్ పెరుగుతోంది. అట్లీకి ముందు నుంచి భారీ సెటప్స్ అలవాటే.

By:  M Prashanth   |   19 Aug 2026 10:00 PM IST
శంకర్ తో అవ్వలేదు.. శిష్యుడు తీసుకొస్తాడా?
X

అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో సిద్ధమవుతున్న రాకాపై అంచనాలు మామూలుగా లేవు. అయితే ఈ సినిమాలో విలన్ గా హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటించబోతున్నాడనే టాక్ మళ్ళీ వైరల్ అవుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఈ పాత్ర కోసం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్టు సెట్ అయితే విదేశాల్లోనే ఒక షెడ్యూల్ ప్లాన్ చేసే ఆలోచనలో టీమ్ ఉందట.

మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోయినా ఈ రేంజ్ కాస్టింగ్ రూమర్ బయటకు రావడంతో మళ్ళీ బజ్ పెరుగుతోంది. అట్లీకి ముందు నుంచి భారీ సెటప్స్ అలవాటే. శంకర్ దగ్గర రోబో, స్నేహితుడు సినిమాలకు అసిస్టెంట్ గా వర్క్ చేశాడు. శంకర్ సినిమాల్లో విదేశీ టెక్నీషియన్స్, భారీ కాస్టింగ్ ఉండటం అందరికీ తెలిసిందే. అయితే ఒకానొక దశలో శంకర్ ఏకంగా ఒక హాలీవుడ్ స్టార్ నే నేరుగా విలన్ గా దించాలనుకున్నాడు. రజనీకాంత్ హీరోగా వచ్చిన 2.0 సినిమా కోసం ఈ భారీ స్కెచ్ వేశాడు.

ఆ సినిమాలో అక్షయ్ కుమార్ చేసిన పక్షిరాజ క్యారెక్టర్ కోసం ముందుగా ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ను అనుకున్నారు. ఈ విషయాన్ని శంకర్ అఫిషియల్ గానే చెప్పాడు. ఆర్నాల్డ్ తో చర్చలు జరగడం, ఆయన డేట్స్ కూడా ఇవ్వడం అంతా జరిగిపోయాయి. కానీ హాలీవుడ్ కాంట్రాక్ట్స్, ఇండియన్ సినిమా రూల్స్ మధ్య కొన్ని టెక్నికల్ సమస్యలు రావడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి ఆర్నాల్డ్ తప్పుకున్నాడు.

ఇప్పుడు అట్లీ కూడా రాకా సినిమా కోసం సరిగ్గా అదే తరహాలో ప్లాన్ చేస్తున్నాడు. మరో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ తో చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయని, ఆయన డేట్స్ కు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ డిజైన్ తో సహా అన్నీ సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఈ రూమర్స్ నిజమైతే గనక ఇది ఒక చిన్న గెస్ట్ రోల్ కాకుండా బన్నీని ఢీకొట్టే పూర్తి స్థాయి పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

నిజానికి విల్ స్మిత్ కు ఇండియన్ స్క్రీన్ కొత్తేమీ కాదు. గతంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించాడు. కానీ ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయడం మాత్రం ఇదే తొలిసారి అవుతుంది. పాన్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ కు తోడు ఇలాంటి ఒక హాలీవుడ్ స్టార్ ఆపోజిట్ లో నిలబడితే సినిమా రేంజ్ మామూలుగా ఉండదు.

అయితే ఆర్నాల్డ్ లాంటి స్టార్ లాస్ట్ మినిట్ వరకు వచ్చి ఆగిపోయిన హిస్టరీ గురించి తెలిసిందే. అందుకే విల్ స్మిత్ ఎంట్రీ మీద మేకర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ అట్లీ నిజంగానే ఈ డీల్ సెట్ చేస్తే మాత్రం నాడు తన గురువు శంకర్ చేయలేకపోయిన హాలీవుడ్ విలన్ ప్రయోగాన్ని ఇప్పుడు శిష్యుడు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినట్టే.