Begin typing your search above and press return to search.

బన్నీ ఫ్యాన్స్‌కు టెస్ట్ టైమ్.. రాకా కోసం ఇంకా ఎంత వెయిట్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రాకా చుట్టూ తాజా బజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 April 2026 1:17 PM IST
బన్నీ ఫ్యాన్స్‌కు టెస్ట్ టైమ్.. రాకా కోసం ఇంకా ఎంత వెయిట్?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రాకా చుట్టూ తాజా బజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొదట 2027 ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు ఆ టైమ్‌లైన్‌ను మిస్ అయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ 2027 లేదా సంక్రాంతి 2028కు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై రిలీజ్ వాయిదా వార్తలు ఫ్యాన్స్‌లో ఆసక్తితో పాటు కొంత ఆందోళనను కూడా పెంచుతున్నాయి.

2027 ఏప్రిల్ వ‌ర‌కు రాకా షెడ్యూల్స్

ఈ ఊహాగానాలకు కారణంగా మారింది ముంబై షూటింగ్ నుంచి బయటకు వచ్చిన ఓ చిన్న క్లూ. చిత్ర యూనిట్ ఉపయోగిస్తున్న ఐడెంటిటీ ట్యాగ్‌పై ఉన్న వివరాల ప్రకారం, షూటింగ్ షెడ్యూల్ ఏప్రిల్ 2027 వరకూ కొనసాగవచ్చని సంకేతాలు కనిపించాయి. సాధారణంగా పెద్ద సినిమాలకు లాంగ్ షెడ్యూల్స్ ఉండటం కొత్త విషయం కాదు. కానీ రాకా విషయంలో ఈ స్థాయి లాంగ్ షూటింగ్ ఎందుకు అవసరమైంది అన్న ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. డైరెక్ట‌ర్ అట్లీ తన స్టైల్‌కు తగ్గట్టుగా ప్రతి సీన్‌ను గ్రాండియర్‌గా ప్లాన్ చేస్తున్నార‌నే టాక్ ఉంది.

రాకా హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా

ఇక ఈ ఆలస్యానికి మరో కీలక కారణంగా చెప్పబడుతున్నది భారీ పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్. ఈ సినిమా కోసం హాలీవుడ్‌కు చెందిన ప‌లువురు టెక్నీషియన్స్ కూడా వ‌ర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్‌కే ఎనిమిది నెలల కంటే ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే, రాకా విజువల్ పరంగా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఫ్యాన్స్ మిక్డ్స్ రియాక్ష‌న్స్

అయితే ఈ భారీ స్కేల్ ఒకవైపు హైప్‌ను పెంచుతుండగా, మరోవైపు వెయిటింగ్ టైమ్ కూడా పెరుగుతోంది. కాగా ఈ విష‌యంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్ మిక్స్‌డ్‌గా ఉంది. మంచి క్వాలిటీ కోసం ఎంతైనా వెయిట్ చేస్తామ‌ని ఓ వర్గం చెబుతుండగా, ఇంకా ఎంత కాలం వెయిట్ చేయాలంటూ మరొక వర్గం ప్రశ్నిస్తోంది. అల్లు అర్జున్ ఫ్యాన్‌బేస్‌లో మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై రోజురోజుకూ ఆస‌క్తి పెరుగుతూనే ఉంది.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న రాకా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తోందని స్పష్టమవుతోంది. అందుకే మేకర్స్ రిలీజ్ టైమింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి 2028 సీజన్‌ను టార్గెట్ చేస్తే, భారీ బాక్సాఫీస్ రన్ సాధించే అవకాశం ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో, ఇతర స్టార్ సినిమాలతో క్లాష్ ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికర అంశంగా మారింది. మొత్తానికి, భారీ అంచనాలు, విస్తృతమైన నిర్మాణ ప్రక్రియ, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వర్క్ అన్నీ క‌లిపి రాకాను ఒక లాంగ్ గెస్టేషన్ ప్రాజెక్ట్‌గా మార్చుతున్నాయి.