బన్నీతో మూవీ.. అట్లీ షూటింగ్ 'స్ట్రాటజీ' ఏంటి?
ఇప్పుడు అలాంటి స్ట్రాటజీతోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా విషయంలో దర్శకుడు అట్లీ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 5 July 2026 4:00 PM ISTభారీ సినిమా తీయడం ఒక ఎత్తైతే.. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడం మరో ఎత్తు. అందులోనూ వందల కోట్ల బడ్జెట్, భారీ క్యాస్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సినిమా అయితే ప్లాన్ పక్కాగా ఉండాలి. ఇప్పుడు అలాంటి స్ట్రాటజీతోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా విషయంలో దర్శకుడు అట్లీ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న రాకా షూటింగ్ వీలైనంత వేగంగా పూర్తి చేయడమే మూవీ టీమ్ ముందున్న లక్ష్యమనే చర్చ జరుగుతోంది.
పుష్ప 2 తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడం, జవాన్ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో రాకాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు హై బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తుండటం ఆసక్తి పెంచుతోంది. అయితే సినిమా కథ, జానర్, అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన వివరాలు మేకర్స్ బయటకు రానివ్వడం లేదు. ఒకవైపు సీక్రెసీ పాటిస్తూనే.. మరోవైపు షూటింగ్ వేగంగా పూర్తి చేసేలా అట్లీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా భారీ సినిమాల షూటింగ్ ఎక్కువ కాలం కొనసాగితే బడ్జెట్ పెరిగే అవకాశం ఉంటుంది. క్యాస్టింగ్ కాల్షీట్లు, సెట్స్, విదేశీ షెడ్యూల్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. ఇలా అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. అందుకే రాకా విషయంలో పక్కా ప్లాన్ తో వెళ్లాలని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా 2026లోనే షూటింగ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అట్లీ ఒక షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో షెడ్యూల్ ప్రారంభించే విధంగా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు మెయిన్ క్యాస్టింగ్ పాల్గొనే సన్నివేశాలను ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్. అదే సమయంలో సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకొణెతో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇంతమంది స్టార్ల కాల్షీట్లను ఒకేసారి అడ్జెస్ట్ చేయడం ఈజీ కాదు. అందుకే అందుబాటులో ఉన్న తేదీల ఆధారంగా విడివిడిగా షెడ్యూల్స్ రూపొందించి షూటింగ్ పూర్తి చేయాలన్నది అట్లీ స్ట్రాటజీగా కనిపిస్తోంది.
మరోవైపు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎక్కువ అప్డేట్స్ ఇవ్వకుండా సీక్రెసీ పాటించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాపై ఉన్న ఆసక్తిని అలాగే కొనసాగిస్తూ.. చిత్రీకరణ పూర్తయిన తర్వాతే ప్రమోషన్స్ వేగం పెంచాలనే ఆలోచనలో ఉన్నారట. అంటే ముందుగా షూటింగ్ పూర్తి చేయడం.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్, రిలీజ్ పై దృష్టి పెట్టడం అన్నమాట.
అయితే రాకాకు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం అవసరం. అందుకే షూటింగ్ ముందుగానే పూర్తి చేసి మిగిలిన పనులకు తగిన సమయం ఇవ్వాలన్నది మేకర్స్ ప్లాన్ గా తెలుస్తోంది. ఏదేమైనా రాకా విషయంలో అట్లీ స్ట్రాటజీ క్లియర్ గా కనిపిస్తోంది. సినిమా గురించి ఎక్కువ విషయాలు బయటకు రానివ్వకుండా ఆసక్తి కొనసాగించడం.. మరోవైపు పక్కా షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తి చేయడం.. ఆ తర్వాతే ప్రమోషన్స్, రిలీజ్ పై ఫోకస్ పెట్టడం. మరి భారీ ప్లానింగ్ తో అల్లు అర్జున్-అట్లీ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
