హిస్టరీలో రాసిపెట్టుకునేలా చేస్తాడా..?
ఆడియన్స్ ఇస్తున్న ప్రేమను తాను తిరిగి ఇస్తున్నా అంటున్నాడు అట్లీ. రాజా రాణి తీసినప్పుడు తన పై ప్రేమ చూపించారు.
By: Ramesh Boddu | 11 Oct 2025 1:07 PM ISTపుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన మాస్ స్టామినా ఏంటో చూపించాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప మొదటి రెండు భాగాలు సెన్సేషనల్ హిట్ అందుకున్నాయి. పుష్ప 1 తో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న అల్లు అర్జున్ పార్ట్ తో కూడా అవార్డ్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిథి మారన్ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు.
చాలా పెద్ద ప్లానింగ్ తోనే..
ఐతే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోతోనే ప్రాజెక్ట్ రేంజ్ ఏంటన్నది చూపించారు. ఇక సినిమా గురించి లేటెస్ట్ గా అట్లీ క్రేజీ కామెంట్స్ చేశారు. ఇండియన్ సినిమాల్లోనే ఒక కొత్త అటెంప్ట్ గా ఇది వస్తుందని అన్నారు. సినిమా చాలా పెద్ద ప్లానింగ్ ఉందని చెప్పుకొచ్చారు. కచ్చితంగా ఆడియన్స్ కు ఒక మంచి విజువల్ ట్రీట్ అందించేలా ఇది ఉంటుందని అంటున్నారు. సో హిస్టరీలో రాసి పెట్టుకునే సినిమా తీసే ప్లానింగ్ తో అట్లీ ఉన్నాడనిపిస్తుంది.
ఆడియన్స్ ఇస్తున్న ప్రేమను తాను తిరిగి ఇస్తున్నా అంటున్నాడు అట్లీ. రాజా రాణి తీసినప్పుడు తన పై ప్రేమ చూపించారు. ఆ తర్వాత తెరి, మెర్సల్, జవాన్ ఇలా ఆడియన్స్ ఇస్తున్న ప్రేమను తిరిగి వాళ్లకి ఇస్తున్నా అని.. మళ్లీ అల్లు అర్జున్ సినిమాతో ఈసారి ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ అందిస్తానని అన్నారు.
అల్లు అర్జున్ ఈ సినిమాతో..
అట్లీ, అల్లు అర్జున్ ఈ కాంబినేషన్ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోలో ఇదొక ఇండియన్ సూపర్ హీరో మూవీగా వస్తుందనిపిస్తుంది. ఐతే ఈ సినిమా ప్రతి విషయంలో మేకర్స్ చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారని అనిపిస్తుంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటన్నది చూపించబోతున్నారు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ తో పాన్ ఇండియా లెవెల్ లో పూనకాలు తెప్పించేశాడు. ఇప్పుడు అట్లీ సినిమాతో మళ్లీ నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ చూపించబోతున్నాడు. సినిమా గురించి అట్లీ చెప్పిన దాని బట్టి చూస్తే ఇదేదో గట్టిగా వర్క్ అవుట్ అయ్యేలానే ఉందనిపిస్తుంది.
ఈ సినిమాను 2026 ఎండింగ్ లేదా 2027లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ 22వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయనిపిస్తుంది.
