అల్లు అర్జున్- అట్లీ సినిమా.. అవన్నీ అవాస్తవాలే!
అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్- అట్లీ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 31 Aug 2025 4:00 PM ISTపుష్ప, పుష్ప2 సినిమాలతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు బన్నీ. అనౌన్స్‌మెంట్ తోనే విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది ఈ చిత్రం.
అల్లు అర్జున్- అట్లీ సినిమాలో విజయ్ సేతుపతి
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుని శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా గురించి రీసెంట్ గా ఓ వార్త నెట్టింట వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఈ ప్రిస్టీజియస్ ప్రాజెక్టులో నటించనున్నారని వార్తలు రాగా, ఆ వార్త క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో మక్కల్ సెల్వన్ ను విలన్ రోల్ కోసం సెలెక్ట్ చేశారని పుకార్లు ఎక్కువయ్యాయి.
జవాన్ లో విలన్ గా నటించిన మక్కల్ సెల్వన్
అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్- అట్లీ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఇవి కేవలం రూమర్లేనని అంటున్నారు. గతంలో షారుఖ్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రల్లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ లో విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా నటించడంతో ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో కూడా సేతుపతి నటిస్తారని వార్తలు వచ్చి ఉండొచ్చు.
రంగంలోకి హాలీవుడ్ టెక్నీషియన్లు
సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో అల్లు అర్జున్ కు ప్రతినాయకుడిగా ఎవరు కనిపిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
