Begin typing your search above and press return to search.

బన్నీ అట్లీ.. మొదటి సర్ ప్రైజ్ గట్టిగానే..

హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ క్వాలిటీతో, సూపర్ హీరో కాన్సెప్ట్‌ తో సినిమాను రూపొందిస్తున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   11 March 2026 12:43 PM IST
బన్నీ అట్లీ.. మొదటి సర్ ప్రైజ్ గట్టిగానే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. గత కొంతకాలంగా ఆ ప్రాజెక్ట్ గురించి వివిధ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ క్వాలిటీతో, సూపర్ హీరో కాన్సెప్ట్‌ తో సినిమాను రూపొందిస్తున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఆ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ కొన్ని గంటలుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా బన్నీ బర్త్‌ డే అంటే అభిమానులకు ఒక పండగలాంటిదే. ప్రతి ఏడాది ఏదో ఒక స్పెషల్ అప్డేట్‌ తో అభిమానులను సర్ప్రైజ్ చేసే అలవాటు ఆయనకు ఉంది.

ఈసారి కూడా అదే రేంజ్ లో అట్లీతో చేస్తున్న మూవీ నుంచి భారీ సర్ప్రైజ్ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. బన్నీ ఫస్ట్ లుక్ ను గ్లింప్స్ రూపంలో రివీల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అది మామూలు గ్లింప్స్ కాదని.. ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయ్యేలా.. ఇండస్ట్రీ షాక్ అయ్యేలా.. అట్లీ స్టైల్‌ కు తగ్గట్టుగా హైవోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్, స్టైలిష్ విజువల్స్‌ తో టైటిల్ టీజర్‌ ను రెడీ చేస్తున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

అందులో అల్లు అర్జున్ మాస్ అప్పీల్‌ ను హైలైట్ చేసేలా డిజైన్ చేస్తున్నారని సమాచారం. టీజర్‌ కు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందిస్తున్న బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. దీంతో టైటిల్ టీజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ గ్లింప్స్ ను ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 11:59 నిమిషాలకు విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది.

లేదంటే ఏప్రిల్ 7 సాయంత్రం అయినా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ గ్లింప్స్ ను బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్ తో డిజిటల్‌ గా లాంఛ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఆ వర్చువల్ ఈవెంట్‌ లో హీరో అల్లు అర్జున్‌ తో పాటు హీరోయిన్ దీపికా పదుకొణె, దర్శకుడు అట్లీ పాల్గొనే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ జోనర్ లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ తో అట్లీ తెరకెక్కిస్తున్నారని సమాచారం. తండ్రీకొడుకుల భావోద్వేగాల చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తోంది. బన్నీ, దీపికా లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. ఈ ఏడాది చివర్లో మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.