Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కాకుండా ముంబైలో ఎందుకు బన్నీ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్ప 2 తర్వాత ఆయన చేస్తున్న ప్రతి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   3 Feb 2026 3:21 PM IST
హైదరాబాద్ కాకుండా ముంబైలో ఎందుకు బన్నీ?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్ప 2 తర్వాత ఆయన చేస్తున్న ప్రతి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులో ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ పై ప్రత్యేక హైప్ కనిపిస్తోంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ లొకేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది.

సాధారణంగా తెలుగు సినిమాల మెజారిటీ షూటింగ్ మన హైదరాబాద్‌ లోనే జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియో, సారథి, అల్యూమినియం ఫ్యాక్టరీ వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నా.. బన్నీ- అట్లీ మూవీ టీమ్ మాత్రం ముంబైకి షిఫ్ట్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కొత్త షెడ్యూల్ ముంబైలో ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది.

ముంబైలోని చిత్రకూట్ స్టూడియోలో దాదాపు అన్ని ఫ్లోర్లు బుక్ చేసుకుని భారీ సెట్లు వేసి షూటింగ్ చేస్తున్నారు. సినిమా మేజర్ పార్ట్ అంతా అక్కడే పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రశ్న ఏమిటంటే.. హైదరాబాద్ కాకుండా ముంబై ఎందుకు?.. నెట్టింట దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఇది డైరెక్టర్ అట్లీ కంఫర్ట్ కోసమే అంటున్నారు.

అట్లీకి బాలీవుడ్ టెక్నీషియన్స్, ముంబై టీమ్‌ తో మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఇప్పటికే జవాన్ తో అక్కడ సూపర్ హిట్ అందుకున్నారు. అందుకే అక్కడే షూటింగ్ సెట్ చేసుకున్నారని చెబుతున్నారు. మరోవైపు, సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, స్పెషల్ సెట్స్ కోసం ముంబైలో బెస్ట్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండటంతో ప్లాన్ చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే సినిమా పాన్ ఇండియా మాత్రమే కాకుండా, బాలీవుడ్ మార్కెట్‌ ను కూడా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్ట్. అందుకే హిందీ మార్కెట్‌ కు దగ్గరగా ఉండేలా ముంబైలో షూట్ చేస్తే బెటర్ ప్రమోషన్స్, నెట్వర్కింగ్ ఈజీ అవుతుందని భావించినట్లు సమాచారం. అదే సమయంలో హిందీ మూవీస్ ఇప్పుడు హైదరాబాద్‌ లో షూట్ చేస్తుంటే, మన తెలుగు సినిమా మాత్రం ముంబై వెళ్లడం ఎందుకనే చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.

దాంతోపాటు అట్లీ మూవీని ఇప్పుడు ముంబైలో షూట్ చేస్తుండగా.. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ చేయనున్న మూవీ చిత్రీకరణ ఎక్కడ ఉంటుందోనని మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్, చెన్నైలో సినిమాకు ఆఫీసులు ఉన్నాయట. కాబట్టి ఆ ప్రాజెక్ట్ షూటింగ్ సంగతేంటోనని కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఏదేమైనా బన్నీ అప్ కమింగ్ చిత్రాల షూటింగ్ స్పాట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం విశేషం.