అట్లీ ప్లానింగ్.. ఎవరూ ఊహించని విధంగా!
అంచనాలు భారీగా ఉండటం వల్లే అల్లు అర్జున్- అట్లీ మూవీకి సంబంధించిన ఏ చిన్న న్యూస్ వినిపించినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 14 Nov 2025 12:46 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తుండగా, సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీ కోసం ఏకంగా రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న అల్లు అర్జున్- అట్లీ మూవీ
అంచనాలు భారీగా ఉండటం వల్లే అల్లు అర్జున్- అట్లీ మూవీకి సంబంధించిన ఏ చిన్న న్యూస్ వినిపించినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంది. పైగా పుష్ప2 లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ నుంచి వస్తున్న మూవీ కావడంతో అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో భారీ గ్రాఫిక్స్ ఉంటాయని, వాటి కోసమే చాలా ఎక్కువ టైమ్ పట్టే ఛాన్సుందని మేకర్స్ ముందునుంచే చెప్పుకుంటూ వస్తున్నారు.
అనుకున్న దానికంటే చాలా ముందుగా..
దీంతో అల్లు అర్జున్- అట్లీ సినిమా ఇప్పట్లో రాదు, ఆ సినిమా పూర్తవడానికి చాలానే టైమ్ పడుతుందని అంతా అనుకున్నారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేసేలా ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాను మొదలుపెట్టే ముందే అట్లీ 90% ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేయడంతో పాటూ మేకింగ్ విషయంలో కూడా అట్లీ చాలా పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల షూటింగ్ చాలా ఫాస్ట్ గా పూర్తవుతుందని తెలుస్తోంది.
2026 మే నాటికి షూటింగ్ పూర్తి
హై కాన్సెప్ట్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్టు అత్యాధునిక వీఎఫ్ఎక్స్ మరియు టెక్నికల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతుందని, డిసెంబర్- జనవరి నుంచి షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరగనుందని, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుందడగా, మొత్తం షూటింగ్ ను 2026 మే నాటికి పూర్తి చేసి, సినిమాను 2026 దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు 2027లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు తర్వగా షూటింగ్ ఫినిష్ అవుతుండటంతో
దసరాకే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు జపనీస్- బ్రిటీష్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషి ని టెక్నికల్ టీమ్ లో భాగం చేసి సినిమాకు హాలీవుడ్ లెవెల్ లో క్రేజ్ ను పెంచుతున్నారు.
