Begin typing your search above and press return to search.

అట్లీ కూడా లోకేష్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ తో జవాన్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న అట్లీ ఆ సినిమా తర్వాత పుష్ప రాజ్ అదే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   21 Aug 2025 3:20 PM IST
అట్లీ కూడా లోకేష్ చేసిన తప్పే చేస్తున్నాడా..?
X

బాలీవుడ్ బాద్షా షారుఖ్ తో జవాన్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న అట్లీ ఆ సినిమా తర్వాత పుష్ప రాజ్ అదే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆమె మాత్రమే కాదు మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వి కపూర్ కూడా ఉంటారని టాక్.

అట్లీ స్క్రిప్ట్ పక్కా బ్లాక్ బస్టర్..

ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తాడట. అట్లీ రాసిన స్క్రిప్ట్ మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అనిపించేలా ఉందట. ఐతే ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కోసం విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారట అట్లీ. ఆయన డైరెక్ట్ చేసిన జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా చేశాడు. జవాన్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఆ సినిమా తర్వాత నుంచి విజయ్ సేతుపతి ఇక విలన్ గా చేయకూడదని ఫిక్స్ అయ్యాడు.

ఈమధ్య తన సోలో సినిమాలతో మళ్లీ తన ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్నాడు విజయ్ సేతుపతి. రీసెంట్ గానే తలైవర్ తలైవి అదే తెలుగులో సార్ మేడం సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఐతే విజయ్ సేతుపతి అట్లీ కి ముందు నో చెప్పినా సరే అతను ఒప్పుకునే దాకా పట్టుబట్టాడట. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ రోల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.

లోకేష్ కనకరాజ్ కూడా కూలీ సినిమాలో..

ఐతే లోకేష్ కనకరాజ్ కూడా కూలీ సినిమాలో వాళ్లు వీళ్లని తేడా లేకుండా అందరినీ తీసుకొచ్చాడు. కానీ వాళ్లకు సరైన పాత్రలు ఇవ్వక సినిమా నిరాశపరిచాడు. ఇప్పుడు అట్లీ కూడా హడావిడి చూస్తుంటే భారీ ప్లానింగే ఉన్నట్టు ఉంది. కానీ అలా ఊరించి ఉసూరుమనిపించడం కన్నా ముందు స్క్రిప్ట్ మీద గట్టిగా పనిచేస్తే బెటర్ అని అంటున్నారు. నిజంగానే విజయ్ సేతుపతి చేయాల్సిన రోల్ అయితే తప్ప ఒకవేళ అది నామమాత్రపు రోల్ అయితే మాత్రం సినిమాకు కచ్చితంగా నెగిటివిటీ తెస్తుంది. మరి ఈ విషయంలో అట్లీ ఎలా ఆలోచిస్తున్నారు అన్నది చూడాలి. జవాన్ తర్వాత అట్లీ.. పుష్ప 1 అండ్ 2 తర్వాత అల్లు అర్జున్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి.