ఇంతమందిలో బన్నీ నెక్ట్స్ ఎవరితో అబ్బా?
పుష్ప తర్వాతే అల్లు అర్జున్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. పుష్ప2 తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న బన్నీ, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 6 Nov 2025 11:55 AM ISTపుష్ప సినిమా అల్లు అర్జున్ లైఫ్ మొత్తాన్ని మార్చేసింది. అప్పటివరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీని ఈ సినిమా ఐకాన్ స్టార్ గా మార్చడమే కాకుండా ఏకంగా ఆ సినిమాతో నేషనల్ అవార్డు అందుకునే స్థాయికి చేర్చింది. ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన పుష్ప1, పుష్ప2 సినిమాలు ఏ రేంజ్ కలెక్షన్లను అందుకున్నాయో, ఎలాంటి రికార్డులను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అట్లీ సినిమాతో బన్నీ బిజీ
పుష్ప తర్వాతే అల్లు అర్జున్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. పుష్ప2 తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న బన్నీ, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. 2027లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఓ వైపు ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటూనే బన్నీ కొత్త కథలను వింటున్నారు. ఇప్పటికే బన్నీతో సినిమాలు చేయడానికి పలువురు డైరెక్టర్లు ఆసక్తిగా ఉన్నారు.
సంజయ్ లీలా భన్సాలీతో డిస్కషన్స్
పుష్ప2 కు ముందు సంవత్సరం నుంచే బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో బన్నీ ఓ ప్రాజెక్టు కోసం చర్చలు జరగ్గా, ఆ డిస్కషన్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలంటే కొంత కాలం ఎదురుచూడక తప్పదు. సంజయ్ లీలా భన్సాలీతో పాటూ బోయపాటి శ్రీను కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ సరైనోడుకు సీక్వెల్ గా సరైనోడు2ను చేయాలని బోయపాటి భావిస్తున్నారట. ప్రస్తుతం అఖండ2 పనుల్లో బిజీగా ఉన్న బోయపాటి ఆ సినిమా తర్వాత సరైనోడు2 చేయాలనుకుంటున్నారని, అల్లు అర్జున్, అల్లు అరవింద్ నుంచి బోయపాటికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ సినిమా కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి.
నీల్ తో మూవీ కోసం డిస్కషన్స్
మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయాలని భావించిన నిర్మాత దిల్ రాజు వీరిద్దరికీ ఓ మీటింగ్ ను ఏర్పాటు చేయగా, ఇద్దరూ ఇప్పుడు స్క్రిప్ట్ పై డిస్కషన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ కాంబినేషన్ పై ఎలాంటి అప్డేట్ లేదు కానీ ఒకవేళ ఈ కాంబోలో సినిమా రావాలంటే చాలా ఏళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్రాగన్ తో బిజీగా ఉన్న నీల్, ఆ తర్వాత కెజిఎఫ్3, సలార్2 ను చేయాల్సి ఉంది.
ఇవి కాకుండా ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నారని అంటున్నారు. అయితే రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 లో తలమునకలై ఉన్నారు. ఎంతలేదన్నా ఆ సినిమా పూర్తవడానికి రెండేళ్లు పడుతుంది. ఇక కొరటాల శివతో గతంలోనే బన్నీ ఓ సినిమాను అనౌన్స్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. మళ్లీ ఈ కాంబోలో సినిమా వస్తుందని, పుష్ప2 తర్వాత బన్నీకి కొరటాల ఓ కథను చెప్పారని, రానున్న రోజుల్లో దీనిపై ఇద్దరూ డిస్కషన్స్ చేయనున్నారని తెలుస్తోంది. వీరిలో బన్నీ తన తర్వాతి సినిమాను ఎవరితో చేస్తారో కానీ, అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీని వీరిలో ఎవరితో చేసినా అది నెక్ట్స్ లెవెల్ లో ఉండటం ఖాయం.
