అల్లు - అట్లీ.. మరో స్పెషల్ రోల్ ఎవరిది?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ అట్లీ కలయికలో రాబోతున్న AA23 ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ ప్లస్ మాస్ మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 22 Jan 2026 12:00 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ అట్లీ కలయికలో రాబోతున్న AA23 ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ ప్లస్ మాస్ మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ గ్లోబల్ ఫిలింకు సంబంధించి కాస్టింగ్ విషయంలో మేకర్స్ చాలా పెద్ద ప్లాన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె ఫిమేల్ లీడ్ గా ఫిక్స్ అయిపోయింది, దీనిపై మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు కావాల్సిన హైప్ దీపికా ఎంట్రీ తోనే మొదలైపోయింది.
అట్లీ తన సినిమాల్లో ఎప్పుడూ భారీ తారాగణాన్ని దించుతుంటారు. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ పేరు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం గట్టిగా వినిపిస్తోంది. సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నార్త్ మార్కెట్ లో కూడా ఒక రేంజ్ లో నిలబెట్టాలని అట్లీ ప్లాన్ చేస్తున్నారు. హిందీ ఆడియన్స్ కి బాగా తెలిసిన మొఖాలను తీసుకోవడం వల్ల సినిమా రీచ్ పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ల సందడి ఎక్కువగా ఉండబోతోంది.
ఇక అసలు విషయానికి వస్తే, బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారనే బజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గత కొంతకాలంగా కాజోల్ కేవలం వెయిటేజ్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. మరి బన్నీ లాంటి మాస్ హీరో సినిమాలో ఆమె ఎలాంటి రోల్ లో కనిపిస్తారనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ఆమె పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
వరుసగా బాలీవుడ్ స్టార్లను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావడం చూస్తుంటే అట్లీ పక్కాగా హిందీ బాక్సాఫీస్ పై కన్నేసినట్లు అర్థమవుతోంది. అల్లు అర్జున్ కు ఇప్పటికే నార్త్ లో ఉన్న క్రేజ్ కు ఈ స్టార్ కాస్టింగ్ తోడైతే రికార్డులు బ్లాస్ట్ అవ్వడం ఖాయం. అయితే కేవలం బాలీవుడ్ స్టార్లనే కాకుండా మన సౌత్ నేటివిటీని కూడా అట్లీ ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి.
కాజల్ లాంటి ఎక్స్ పీరియన్స్ ఉన్న నటి ఈ టీమ్ లోకి రావడం సినిమాకు ఒక కొత్త ఎనర్జీ ఇస్తుందని చెప్పవచ్చు. కాజల్ ఎంట్రీ పై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టైగర్ ష్రాఫ్ వంటి యాక్షన్ స్టార్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారనే వార్తలు ఇప్పటికే అంచనాలను పెంచేస్తున్నాయి. ఇంత మంది భారీ స్టార్ల మధ్య బన్నీ తనదైన స్టైల్ లో ఎలా కనిపిస్తారో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఒకవేళ కాజల్ రోల్ గనుక పవర్ ఫుల్ గా ఉంటే స్క్రీన్ మీద ఆమె పర్ఫార్మెన్స్ మరో లెవల్ లో ఉంటుంది. అల్లు అట్లీ సినిమా టాలీవుడ్ లెక్కలను మార్చేలా కనిపిస్తోంది. దీపికా, మృణాల్ ఇప్పుడు వినిపిస్తున్న కాజల్ పేర్లు చూస్తుంటే అట్లీ ఒక ఇంటర్నేషనల్ స్కేల్ మూవీని మనకు చూపించబోతున్నారని అర్థమవుతోంది. మరి ఈ క్రేజీ అప్‌డేట్స్ పై అసలు క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
