దీపికా యాక్షన్ లోకి దిగేదప్పుడే!
ఇండియన్ సినిమాలో మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా AA22xA6. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 3 Sept 2025 3:00 PM ISTఇండియన్ సినిమాలో మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా AA22xA6. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. పుష్ప2 తర్వాత బన్నీ నుంచి, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు పై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
రంగంలోకి హాలీవుడ్ టెక్నీషియన్లు
ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా అట్లీ ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్ తో పాటూ హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా రంగంలోకి దించారు అట్లీ. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొణె ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
యాక్షన్ సీన్స్ చేయనున్న దీపికా
ఇండియన్ సినీ చరిత్రలో అతిపెద్ద సినిమాల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో దీపికా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఈ సినిమాలో దీపికా పలు యాక్షన్ సీన్స్ కూడా చేయనున్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం దీపికా ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ నుంచి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం దీపికా 100 రోజుల డేట్స్ ను కేటాయించారని సమాచారం.
కెరీర్ లోనే నెవర్ బిఫోర్ రోల్..
నవంబర్ నుంచి దీపికాపై యాక్షన్ సీక్వెన్స్ తో పాటూ మరికొంత డ్రామాను తెరకెక్కించనున్నారట అట్లీ. AA22xA6లో దీపికా క్యారెక్టర్ నెవర్ బిఫోర్ లా ఉంటుందని, సినిమాలో ఆమె క్యారెక్టర్ కోసం స్పెషల్ వారియర్ లుక్ ను వెపన్స్ తో రూపొందించినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో పలు లుక్స్ లో కనిపించనున్నారు.
2027 రిలీజ్ కు సన్నాహాలు
2026 సెప్టెంబర్ లోపు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసి 2027 సెకండాఫ్ లో AA22xA6 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం బన్నీ తన టైమ్ ను మాత్రమే కేటాయించకుండా స్పెషల్ కేర్ తీసుకుని మూవీని పూర్తి చేస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
