గెలాక్సీ లెవల్ విజువల్స్‌తో #AA22 వరల్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ #AA22xA6 పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 30 March 2026 10:57 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ #AA22xA6 పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోను అట్లీ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వీడియో ఎప్పుడు రిలీజవుతుందన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ఈ ఆసక్తికరమైన విజువల్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ టైటిల్ రివీల్ వీడియోకు సంబంధించి బయటకు వస్తున్న వివరాలు సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా, మిల్కీ వే గ్యాలక్సీ నేపథ్యంతో రూపొందించిన అద్భుతమైన విజువల్స్, పూర్తిగా కొత్తగా కనిపించే క్రియేచర్స్, అలాగే హై-ఇంపాక్ట్ మోమెంట్స్ ఈ వీడియోలో మెయిన్ ఎట్రాక్షన్స్ గా ఉండనున్నాయని సమాచారం. అట్లీ తన గత సినిమాల్లో చూపించిన కమర్షియల్ టేక్‌కు భిన్నంగా, ఈసారి గ్లోబల్ స్టాండర్డ్స్‌తో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్. ఇప్పటికే తన సంగీతంతో మంచి గుర్తింపు పొందిన సాయి, ఈ భారీ విజువల్ ప్రపంచానికి తగ్గట్టుగా కొత్త సౌండ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతున్నాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి. విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమా స్థాయిని మరింత పెంచే కీలక అంశంగా ఉండనుంది.
నిర్మాణ పరంగా కూడా ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్ అన్నీ కలిసి ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణ. ఆమె గ్లోబల్ రీచ్ ఈ ప్రాజెక్ట్‌కు అదనపు క్రేజ్ తీసుకువస్తుందని చెప్పాలి. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి.
