Begin typing your search above and press return to search.

గ‌ల్ఫ్ ఎడారిలో మోస్ట్ అవైటెడ్ AA22 x A6

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబినేష‌న్ మూవీ AA22 x A6 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల జాబితాలో ఉంది.

By:  Sivaji Kontham   |   10 Sept 2025 9:24 AM IST
గ‌ల్ఫ్ ఎడారిలో మోస్ట్ అవైటెడ్ AA22 x A6
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబినేష‌న్ మూవీ AA22 x A6 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల జాబితాలో ఉంది. దీపికా పదుకొనే ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో చాలా స‌ర్ ప్రైజ్‌లు ఉంటాయ‌ని చెబుతున్నారు. ఇటు బ‌న్నీ, అటు అట్లీ ఇద్ద‌రికీ ఇది పూర్తిగా కొత్త త‌ర‌హా ప్ర‌య‌త్నం కావ‌డంతో అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

తాజాగా దర్శకుడు అట్లీ కొత్త‌ షెడ్యూల్ గురించి ఇన్‌స్టాలో వివ‌రాలందించారు. ప్రస్తుతం అబుదాబిలోని లివా ఎడారిలో షూటింగ్ చేయ‌బోతున్నామ‌ని, ప‌లు లొకేషన్‌లను అన్వేషిస్తున్నారని టీమ్ స‌భ్యులు వెల్లడించారు. విదేశీ షెడ్యూల్ అధికారికంగా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల ముంబై షెడ్యూల్‌ను ముగించారు. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్ పై అద్భుత‌మైన పాట‌ను చిత్రీక‌రించారు.

ఈ సినిమాలో యాక్ష‌న్, డ్యాన్స్ స‌హా గ్రాఫిక్స్- వీఎఫ్ఎక్స్ విభాగాల‌పై చిత్ర‌బృందం ప్ర‌త్యేకించి ఫోక‌స్ చేసింది. భారీ సెట్ల‌లో ఈ సినిమా నిర్మాణం జ‌రుగుతోంది. హాలీవుడ్ ప్ర‌మాణాల్లో ఈ సినిమాని రూపొందించేందుకు విదేశీ టెక్నీషియ‌న్ల‌ను కూడా బ‌రిలో దించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌తో మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నట్లు సమాచారం. బ‌న్ని ఇటీవ‌ల త‌న నాయ‌న‌మ్మ మ‌ర‌ణ వార్త విన్న వెంట‌నే ఔట్ డోర్ షూటింగుకి బ్రేక్ ఇచ్చి హైద‌రాబాద్ కి చేరుకున్నారు. తిరిగి త‌న షెడ్యూల్ ని ప్రారంభించేందుకు ఇప్పుడు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.