Begin typing your search above and press return to search.

బ‌న్నీ 22 రెండు భాగాలు ఇదే సాక్షం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ కాన్సాస్ పై తెర‌క‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   13 Jan 2026 11:00 PM IST
బ‌న్నీ 22 రెండు భాగాలు ఇదే సాక్షం!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ కాన్సాస్ పై తెర‌క‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీని ఏకంగా పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ కి క‌నెక్ట్ చేసే కంటెంట్ లో బ‌న్నీని అట్లీ తీర్చిదిద్దుతున్నాడు. టెక్నిక‌ల్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. బ‌న్నీ లుక్ టెస్ట్ కు సంబంధించి అట్లీ అంత‌ర్జాతీయ స్టూడియోల్లోనే ప‌ని చేసాడు. ఇందులో బ‌న్నీ మూడు పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఆ మూడు పాత్ర‌ల‌కు ముగ్గురు హీరోయిన్లు ఎంపిక‌య్యారు. మెయిన్ లీడ్ లో దీపికా ప‌దుకొణే న‌టిస్తోంది. ఇదంతా తెలిసిన స‌మాచార‌మే. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

కానీ అందులో వాస్త‌వాలు తెలియ‌దు. నెట్టింట జ‌రిగే ప్ర‌చారం ఏది నిజం కాదు. మేక‌ర్స్ అధికారికంగా వెల్ల‌డించే వ‌ర‌కూ న‌మ్మే ప‌రిస్థితి లేదు. అయితే వికీపీడియా స‌మాచారం కొంత వ‌ర‌కూ వాస్త‌వంగా చెప్పొచ్చు. తాజాగా వికీపీడియాలో ఈ చిత్రాన్ని రెండు భాగాలు రిలీజ్ చేస్తున్న‌ట్లు అప్ డేట్ అయింది. అంత‌కు ముందు అదే వికీలో 2028లో చిత్రం రిలీజ్ అవుతున్న‌ట్లు షో అయింది. ఇప్పుడా స్థానంలో రెండు భాగాలు క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రం. అయితే ఈ రెండింటికి ఓ రిలేష‌న్ క‌నెక్ట్ అవుతుంది. మొద‌టి భాగాన్ని ఈ ఏడాది ముగింపు లేదా? వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేసే అవ‌కాశం ఉండొచ్చు.

అది బ‌న్నీ 22 టైటిల్ తో రిలీజ్ అవుతుంది. రెండ‌వ భాగం 23వ టైటిల్ తో 2028లో రిలీజ్ అవుతుంది? అన్న కోణంలో వికీపీడియాలో అలా అప్ డేట్ అయిందా? అన్న సందేహం చాలా మందిలో వ్య‌క్త‌మ‌వుతుంది. ఏది ఏమైనా ఇప్ప‌టికీ ఈ సినిమా రెండు భాగాలగా నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మైతే బ‌న్నీ పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అట్లీ ఇలా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. అలాగే తాను రాసిన క‌థ కూడా ఒకే భాగం లో చెప్ప క‌థ కాక‌పోవ‌డంతో రెండు భాగాలుగా రిలీజ్ ఛాన్స్ తీసుకుని ఉండొచ్చు. కార‌ణం ఏదైనా? బ‌న్నీ `పుష్ప 2` తో ఏకంగా 1800 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించ‌డం అన్న‌ది మేక‌ర్స్ లో చాలా ర‌కాల మార్పుల‌కు దారి తీస్తోంది అన్న‌ది కాద‌న‌లేని నిజం.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. షూట్ మొద‌లైన నాటి నుంచి ముంబైలోనే చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. అక్క‌డ స్టూడియోల‌కే అట్లీ ప్రాధాన్య‌త ఇచ్చి ప‌ని చేస్తున్నాడు. బ‌న్నీ సొంత ప‌రిశ్ర‌మైన టాలీవుడ్ లో...అట్లీ పుట్టిన గ‌డ్డ అయిన చెన్నైలో ఒక్క షెడ్యూల్ అయినా చేస్తాడా? అన్న‌ది చూడాలి. ఈ చిత్రాన్ని 600 కోట్ల బ‌డ్జెట్ తో స‌న్ పిక్చ‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.