Begin typing your search above and press return to search.

అట్లీ మహిమ.. అల్లు అర్జున్ కి ఘోర అవమానం!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయి.. నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ గురించి తెలియని వారు ఉండరు.

By:  Madhu Reddy   |   10 Aug 2025 10:51 AM IST
అట్లీ మహిమ.. అల్లు అర్జున్ కి ఘోర అవమానం!
X

సాధారణంగా ఏ సినిమా అయినా సరే తెరకెక్కించేటప్పుడు దర్శకుడు తన కథకు తగ్గట్టుగా హీరో హీరోయిన్ల మేకవర్ లో మార్పులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈయన కారణంగానే అల్లు అర్జున్ కి ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయి.. నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ గురించి తెలియని వారు ఉండరు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి ఘోర అవమానం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదు నుండి గత నెల అల్లు అర్జున్ ముంబై వెళ్లారు. తన షెడ్యూల్ పూర్తి కాగానే హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవ్వగా.. నిన్న ముంబై విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక అంతానే బాగున్నా.. ముంబై విమానాశ్రయంలో అల్లు అర్జున్ మాస్క్ పెట్టుకొని విమానాశ్రయంలోకి అడుగు పెట్టారు . ఈ సందర్భంగా చెకింగ్ కౌంటర్ దగ్గర ఆయనను చెకింగ్ అధికారి గుర్తుపట్టలేకపోయారు. మాస్క్ తీయండి అని అల్లు అర్జున్ ను అడిగారు. ఇక వెంటనే అల్లు అర్జున్ ఆ మాస్ ను ను తొలగించి తన ముఖాన్ని చూపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే అల్లు అర్జున్ లుక్ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, అందుకే ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తుంటే.. ఒక ఐకాన్ స్టార్ కి ఇంత ఘోర అవమానమా? అని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది పరువు కూడా పోయిందే అంటూ నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు.

ఇక బన్నీ అభిమానులు మాత్రం.. అట్లీ తన సినిమాకు తగ్గట్టుగా అల్లు అర్జున్ మేకోవర్ ను మార్చేశారు. పైగా ముంబైలో మాస్క్ పెట్టుకొని తిరిగితే ఎవరు ఎలా గుర్తుపడతారు అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అట్లీ దెబ్బకు ఇప్పుడు అల్లు అర్జున్ కి అవమానం జరిగింది అని మరి కొంతమంది ఇన్ డైరెక్ట్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా విషయానికి వస్తే.. AA22 x A6 అనే వర్కింగ్ టైటిల్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమా రాబోతోంది. ముఖ్యంగా అవతార్ చిత్రాలకు పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే, రష్మిక మందన్న నటిస్తున్నారు. దీపికా పదుకొనే లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా.. రష్మిక నెగిటివ్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.