Begin typing your search above and press return to search.

AA23 : మొదలు కాకుండానే హిట్‌..!

అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ హీరోల రేంజ్‌లో చేరి పోయాడు అనేడంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Ramesh Palla   |   18 Feb 2026 2:10 PM IST
AA23 : మొదలు కాకుండానే హిట్‌..!
X

అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ హీరోల రేంజ్‌లో చేరి పోయాడు అనేడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ చేస్తున్న సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుందట. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం ను ఉపయోగించుకుంటూ దర్శకుడు అట్లీ ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ను హాలీవుడ్‌ రేంజ్ హీరోకి తక్కువ కాకుండా చూపించబోతున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అల్లు అర్జున్‌ - అట్లీ కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ముఖ్యంగా అల్లు ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో వీరి కాంబో మూవీ గురించి రెగ్యులర్‌గా చర్చ జరుగుతూనే ఉంటుంది. మరో వైపు అల్లు అర్జున్‌ తదుపరి సినిమా విషయం గురించి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చ జరగడం మనం చూస్తున్నాం.

అల్లు అర్జున్‌, అట్లీ కాంబో మూవీ...

అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే బన్నీ తన తదుపరి సినిమాను లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కమల్‌ హాసన్‌, అమీర్‌ ఖాన్‌లతో పాటు మరికొందరు స్టార్‌ హీరోలతో సినిమాలు చేయబోతున్నాడు అంటూ లోకేష్ కనగరాజ్‌ గురించి ప్రచారం జరిగింది. కానీ కూలీ సినిమా ఫలితం తారుమారు కావడంతో కాస్త బ్రేక్ తీసుకుని అల్లు అర్జున్‌తో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ తీసుకున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ ప్రారంభం అయింది. సంగీత దర్శకుడు అనిరుద్‌ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ తో వీరి కాంబో మూవీ అనౌన్స్‌మెంట్‌ వీడియోను విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పైగా ఆ మ్యూజిక్ కి మంచి స్పందన రావడంతో, గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో మోత మ్రోగుతోందని అభిమానులు, అన్ని వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

AA23 షూటింగ్‌ త్వరలో....

లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోతున్న AA23 సినిమాకి సంబంధించిన ప్రకటన వీడియో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటికే మిలియన్‌ కి పైగా రీల్స్ ఈ మ్యూజిక్ తో చేయడం జరిగిందట. అంతే కాకుండా లక్షలాది మంది రింగ్‌ టోన్‌గా ఈ మ్యూజిక్ ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్‌, ఇన్‌స్టా, ఫేస్ బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్ లో ఈ మ్యూజిక్ తెగ ట్రెండ్‌ కావడంతో ఇప్పటికే AA23 సినిమా హిట్ అయిందని అభిమానులు అంటున్నారు. ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాకుండానే, కనీసం క్లాప్ కూడా పడకుండానే సినిమాకు హిట్ టాక్‌ వచ్చిందని చాలా మంది ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం పూర్తిగా అట్లీ సినిమా మూడ్‌ లో ఉన్న అల్లు అర్జున్‌ కొత్త సినిమా ప్రారంభంకు మరికాస్త టైమ్‌ తీసుకున అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

అనిరుధ్‌ మ్యూజిక్‌ వైరల్‌..

పుష్ప సినిమా తర్వాత పాన్‌ ఇండియా రేంజ్‌ లో అల్లు అర్జున్‌ కి ఫ్యాన్స్‌ పెరిగారు. అందుకే ఆయన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో పాన్ ఇండియా రేంజ్ స్క్రిప్ట్‌, సినిమాతో అట్లీ రాబోతున్నాడు. వీరిద్దరి కాంబో మూవీని అత్యధిక భారీ బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. బన్నీ కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడని కూడా అంటున్నారు. ఇక అల్లు అర్జున్‌, లోకేష్ కనగరాజ్‌ కాంబో మూవీని మైత్రి మూవీ మేకర్స్‌ వారు నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం బన్నీ, అనిరుధ్‌ లు అత్యధిక పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. లోకేష్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించే పనిలో ఉన్నాడు. ఆయనకు ఇప్పుడు ఎక్కువ సమయం ఉంది. కనుక దాన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి వినియోగించుకునేందుకు లోకేష్ ప్లాన్‌ చేశాడు. ఇప్పటికే వచ్చిన పాజిటివ్‌ రెస్పాన్స్ నేపథ్యంలో AA23 సినిమాను మరింత జోష్ తో మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.