Begin typing your search above and press return to search.

AA22xA6: నిద్రలేని రాత్రులట

అల్లు అర్జున్ అట్లీ కాంబో అంటేనే మాస్ అండ్ స్టైలిష్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని ఆడియన్స్ భావిస్తున్నారు.

By:  M Prashanth   |   28 Jan 2026 10:00 PM IST
AA22xA6: నిద్రలేని రాత్రులట
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రీసెంట్‌గా ఒక కార్యక్రమంలో పాల్గొన్న అట్లీ, ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో తనకు తెలుసని, త్వరలోనే ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం టీమ్ మొత్తం ఈ సినిమా పనుల్లోనే తలమునకలై ఉందని తెలిపారు.

ఈ భారీ ప్రాజెక్ట్ కోసం తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని అట్లీ వెల్లడించారు. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని ఈ కథలో వెతుకుతున్నామని, అవుట్‌పుట్ అద్భుతంగా రావడానికి విరామం లేకుండా పని చేస్తున్నట్లు చెప్పారు. అప్‌డేట్ ఇవ్వడానికి తనకూ చాలా ఆత్రుతగా ఉందని, అయితే ఒక పక్కా ప్లాన్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని వెయిట్ చేస్తున్నట్లు వివరించారు. ఈ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కించేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు.

ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమాలో నటిస్తుండటంపై కూడా అట్లీ స్పందించారు. దీపికాను తన లక్కీ చార్మ్‌గా అభివర్ణించారు. ఆమెతో పని చేయడం ఇది రెండోసారి అని, సెట్స్‌లో ఆమె ప్రొఫెషనలిజం అన్ బిలీవబుల్‌గా ఉంటుందని ప్రశంసించారు. తల్లి అయిన తర్వాత దీపికా నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో ఆమెను మునుపెన్నడూ చూడని సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.

అల్లు అర్జున్ అట్లీ కాంబో అంటేనే మాస్ అండ్ స్టైలిష్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని ఆడియన్స్ భావిస్తున్నారు. దానికి తోడు సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్ అనే వార్తలు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచాయి. అట్లీ మాటలను బట్టి చూస్తుంటే, ఈ ప్రాజెక్ట్ కోసం ఒక భారీ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నట్లు అర్థమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ఎమోషనల్‌గా కూడా ఆకట్టుకునేలా కథను తీర్చిదిద్దుతున్నారట.

మొత్తానికి 'AA22' కి సంబంధించి అట్లీ ఇచ్చిన ఈ చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ క్రేజ్, అట్లీ మేకింగ్ స్టైల్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ అవ్వడం ఖాయం. మరి ఈ 'నిద్రలేని రాత్రుల' శ్రమ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే అఫీషియల్ టీజర్ లేదా గ్లింప్స్ వచ్చే వరకు ఆగాల్సిందే.