Begin typing your search above and press return to search.

మొన్న సమంత.. నిన్న శ్రీలీల.. మరి నేడు?

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇప్పుడు మరొక అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచుతోంది. విషయంలోకి వెళ్తే..

By:  Madhu Reddy   |   6 Oct 2025 2:00 PM IST
మొన్న సమంత.. నిన్న శ్రీలీల.. మరి నేడు?
X

అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన.. పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మేల్ విభాగంలో నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా కూడా రికార్డ్ సృష్టించారు. పుష్ప సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన 2వ చిత్రంగా నిలిచిపోయింది.ఇదిలా ఉండగా ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం AA22 x A6 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేస్తున్నాయి. అంతేకాదు అటు అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 2డి యానిమేషన్ నేర్చుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇప్పుడు మరొక అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచుతోంది. విషయంలోకి వెళ్తే.. డైరెక్టర్ అట్లీ ఈ సినిమాలో కమర్షియల్ హంగులతో ఒక ప్రత్యేకమైన సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. పైగా ఈ పాట కోసం ఒక స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని కూడా అట్లీ ప్లాన్ చేస్తున్నారట. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సాంగ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఏ హీరోయిన్ నర్తిస్తుందో చూడాలి.

సాధారణంగా ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ సినిమాలు అనగానే స్పెషల్ సాంగ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇప్పటికే పుష్ప సినిమాలో.. అసలు స్పెషల్ సాంగ్స్ జోలికే వెళ్ళని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత "ఉ అంటావా మావ.. ఉ ఊ అంటావా " అంటూ తన మాస్ స్టెప్ లతో అదరగొట్టేసింది. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ లో తన వంతు పాలుపంచుకుంది. తర్వాత వచ్చిన పుష్ప 2 సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలా కూడా "కిస్ కిస్ కిస్సిక్" అంటూ తన మాస్ ఎనర్జిటిక్ లెవెల్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలా మొన్న సమంత.. నిన్న శ్రీ లీల.. మరి నేడు అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో అల్లు అర్జున్ తో ఐకాన్ స్టెప్స్ వేయించి రికార్డు సృష్టించబోయే ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలని అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి బన్నీ కోసం అట్లీ ఏ హీరోయిన్ ని రంగంలోకి దింపుతారో చూడాలి.

అల్లు అర్జున్ 22వ సినిమా విషయానికి వస్తే.. ఇందులో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. ఒక పవర్ఫుల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఒక డాన్ చుట్టూ సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటీనటుల పేర్లు కూడా తెరపైకి రానున్నాయి.